ఏపీ చరిత్రలోనే కీలకం కానున్న ‘సోమవారం అసెంబ్లీ’

| Edited By: Anil kumar poka

Jan 24, 2020 | 2:29 PM

ఏపీ చరిత్రలో సోమవారం కీలకం కాబోతుందా? ఆ రోజే మండలి రద్దు నిర్ణయం జరుగుతుందా? అందుకోసం మళ్లీ శాసన సభ సమావేశాలు నిర్వహిస్తారా? సోమవారం ఏపీ అసెంబ్లీలో ఏం జరగబోతుంది? రాజధాని వికేంద్రీకరణ మొదలు.. బుధవారం శాసనమండలిలో చోటుచేసుకున్న పరిణామాలతో పాటు.. గురువారం అసెంబ్లీలో సీఎం జగన్ వరకు అంతా ఆసక్తి రేపుతున్నాయి. శాసన సభలోనే చాలా మంది మేధావులు ఉన్నప్పుడు శాసన మండలి ఎందుకని ప్రశ్నించారు సీఎం జగన్. మండలిని రద్దు చేయాలని ఆయన గట్టిగా […]

ఏపీ చరిత్రలోనే కీలకం కానున్న సోమవారం అసెంబ్లీ
Follow us on

ఏపీ చరిత్రలో సోమవారం కీలకం కాబోతుందా? ఆ రోజే మండలి రద్దు నిర్ణయం జరుగుతుందా? అందుకోసం మళ్లీ శాసన సభ సమావేశాలు నిర్వహిస్తారా? సోమవారం ఏపీ అసెంబ్లీలో ఏం జరగబోతుంది? రాజధాని వికేంద్రీకరణ మొదలు.. బుధవారం శాసనమండలిలో చోటుచేసుకున్న పరిణామాలతో పాటు.. గురువారం అసెంబ్లీలో సీఎం జగన్ వరకు అంతా ఆసక్తి రేపుతున్నాయి. శాసన సభలోనే చాలా మంది మేధావులు ఉన్నప్పుడు శాసన మండలి ఎందుకని ప్రశ్నించారు సీఎం జగన్. మండలిని రద్దు చేయాలని ఆయన గట్టిగా చెబుతున్నారు.

పొలిటికల్ అజెండాతో నడుస్తూ.. ప్రజలకు మేలు చేసే విధంగా లేని శాసనమండలిని కొనసాగించాలా లేక రద్దు చేయాలా అన్నదానిపై సీరియస్‌గా ఆలోచించాలన్నారు సీఎం జగన్. సలహాలు, సూచనలు ఇవ్వడానికే శాసనమండలి ఏర్పడిందని, ప్రజలకు మంచి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తే.. మండలిలోని సభ్యులు మాత్రం మేలు జరగకుండా అడ్డుపడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో సోమవారం ఏం జరగబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.. ఇటు ఏపీ ప్రజలతో పాటు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

రాజధాని వికేంద్రీకరణ విషయంలో దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్న ఏపీ సర్కారుకు శాసనస మండలిలో బ్రేకులు పడ్డాయి. రాజధాని వికేంద్రీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందినా.. శాసన మండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపారు. అయితే సెలెక్ట్ కమిటీ నిర్ణయం తెలపడానికి మూడు నెలల సమయం ఉన్నా.. ఇంతకీ మూడు నెలల్లో రిపోర్ట్ వస్తుందా? వచ్చినా ఎలాంటి రిపోర్ట్ వస్తుందనేది క్వశ్చన్ మార్క్‌గా మారింది.