షాకింగ్.. వల్లభనేని రాజకీయాలకు గుడ్‌బై చెప్పబోతున్నారా..!

ఏపీ రాజకీయాల్లో బాగా పేరొందిన వారిలో వల్లభనేని వంశీ ఒకరు. టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన ఈ నేత అనతి కాలంలోనే రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

షాకింగ్.. వల్లభనేని రాజకీయాలకు గుడ్‌బై చెప్పబోతున్నారా..!

Edited By:

Updated on: Apr 16, 2020 | 10:00 PM

ఏపీ రాజకీయాల్లో బాగా పేరొందిన వారిలో వల్లభనేని వంశీ ఒకరు. టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన ఈ నేత అనతి కాలంలోనే రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గన్నవరం నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఎదిగారు. ఇక గతేడాది జరిగిన ఎన్నికల్లోనూ టీడీపీ తరఫున గెలిచిన ఆయన అనూహ్యంగా పార్టీకి రాజీనామా చేసి షాక్‌ ఇచ్చారు. ఇక ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో లేకపోయినా.. వైసీపీకి మద్దతును ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ఆయన ఫేస్‌బుక్‌లో పెట్టిన ఓ పోస్ట్‌ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

పద్నాలుగు సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో నా కష్టసుఖాలలో వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికి పేరుపేరున హృదయపూర్వక ధన్యవాదాలు అని వల్లభనేని ట్వీట్ చేశారు. దీంతో చాలా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అసలు ఈ ట్వీట్ వెనుక ఉద్దేశ్యమేంటి..? రాజకీయ ప్రస్థానం అన్నారంటే.. పాలిటిక్స్‌కు గుడ్‌బై చెప్పబోతున్నారా..? అన్న అనుమానాలు అందరిలో తొలుస్తున్నాయి. మరి వంశీ మనసులో అసలేముంది..? కరోనా టైమ్‌లో ఆయన పెట్టిన ట్వీట్‌కు అర్థమేంటి..? అన్న ప్రశ్నలకు త్వరలోనే సమాధానం తెలుస్తుందేమో చూడాలి.

Read This Story Also: హైదరాబాద్‌లో చైనా యువతులు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు