మంత్రి కురసాల సోదరుడు కన్నుమూత

| Edited By: Pardhasaradhi Peri

Jul 11, 2019 | 7:50 PM

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఇంట విషాదం నెలకొంది. కన్నబాబు సోదరుడు, మాజీ జర్నలిస్ట్ కురసాల సురేష్ గుండెపోటుతో ఇవాళ కన్నుమూశారు. గతంలో ఓ ప్రముఖ దినపత్రికలో రిపోర్టర్‌గా పనిచేశారు సురేష్. తరువాత రియల్ ఎస్టేట్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆయన విశాఖలో కుటుంబంతో నివాసం ఉంటున్నారు. కాగా మంత్రి కురసాల, దర్శకుడు కల్యాణ్ కృష్ణ, సురేష్ ముగ్గురు అన్నదమ్ములన్న విషయం తెలిసిందే. మరోవైపు సురేష్ మృతిపై మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, విశ్వరూప్, […]

మంత్రి కురసాల సోదరుడు కన్నుమూత
Follow us on

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఇంట విషాదం నెలకొంది. కన్నబాబు సోదరుడు, మాజీ జర్నలిస్ట్ కురసాల సురేష్ గుండెపోటుతో ఇవాళ కన్నుమూశారు. గతంలో ఓ ప్రముఖ దినపత్రికలో రిపోర్టర్‌గా పనిచేశారు సురేష్. తరువాత రియల్ ఎస్టేట్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆయన విశాఖలో కుటుంబంతో నివాసం ఉంటున్నారు. కాగా మంత్రి కురసాల, దర్శకుడు కల్యాణ్ కృష్ణ, సురేష్ ముగ్గురు అన్నదమ్ములన్న విషయం తెలిసిందే.

మరోవైపు సురేష్ మృతిపై మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, విశ్వరూప్, ఎమ్మెల్యేలు ద్వారంపూడి, దొరబాబు, దాడిశెట్టి రాజా, చంటిబాబు తదితరులు సంతాపం తెలిపారు.

సీఎం వైఎస్ జగన్ సంతాంపం:
ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సోదరుడు సురేష్ హఠాన్మరణంపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. కన్నబాబును ఫోన్ ద్వారా పరామర్శించిన జగన్.. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా సుదీర్ఘకాలం జర్నలిస్ట్‌గా పనిచేసిన సురేష్.. ప్రస్తుతం కుటుంబంతో విశాఖలో నివాసం ఉంటున్నారు. గుండెపోటుతో విజయవాడలోని ఆంధ్ర ఆసుపత్రిలో చేరిన ఆయన గురువారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని స్వస్థలం కాకినాడకు తరలిస్తున్నారు.