కోడెల చివరి కాల్ చేసింది అతడికే.. ఎంతసేపు మాట్లాడారంటే..!

| Edited By:

Sep 20, 2019 | 10:25 AM

టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య కేసును పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆయన సెల్‌ఫోన్ ఇంకా కనిపించకపోవడంతో కాల్‌డేటాపై ఆరా తీస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన రోజు ఉదయం 9-10 గంటల మధ్యలో ఆయన దాదాపు 10-12 ఫోన్‌కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. చివరగా గన్‌మెన్ ఆదాబ్‌కు ఫోన్ చేసిన కోడెల.. అతడితో దాదాపు 9 సెకన్ల పాటు మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. గుంటూరుకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ఆదాబ్ […]

కోడెల చివరి కాల్ చేసింది అతడికే.. ఎంతసేపు మాట్లాడారంటే..!
Follow us on

టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య కేసును పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆయన సెల్‌ఫోన్ ఇంకా కనిపించకపోవడంతో కాల్‌డేటాపై ఆరా తీస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన రోజు ఉదయం 9-10 గంటల మధ్యలో ఆయన దాదాపు 10-12 ఫోన్‌కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. చివరగా గన్‌మెన్ ఆదాబ్‌కు ఫోన్ చేసిన కోడెల.. అతడితో దాదాపు 9 సెకన్ల పాటు మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు.

గుంటూరుకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ఆదాబ్ గత అయిదేళ్లుగా కోడెల వద్ద ఐదేళ్లుగా గన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆదాబ్‌తో కోడెల 24 నిమిషాలు మాట్లాడారన్న ప్రచారంలో వాస్తవం లేదని, కాల్‌డేటాను పూర్తిగా విశ్లేషిస్తున్నామని బంజారాహిల్స్‌ ఏసీపీ కె.ఎస్‌.రావు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే మరోవైపు బంజారాహిల్స్‌‌లోని కోడెల నివాసం వద్ద ఉన్న పోలీసులు సెక్యూరిటీని పెంచారు. ఎవరైనా ఇంటికి వస్తే తమకు సమాచారం అందజేయాలని స్థానికులకు సూచించారు. మరోవైపు కోడెల నివాసంలోని కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాటిని ఫోరెన్సిక్‌ పరీక్ష కోసం పంపారు. ఆ నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. ఇక కోడెల తనయుడు శివరాంను మరో రెండు రోజుల్లో విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. కోడెల ఆత్మహత్య వెనుక ఇంకా ఏవైనా కారణాలున్నాయా? మానసికంగా ఎవరైనా వేధించారా? ఇతర సమస్యలున్నాయా?.. అన్న వివరాలను శివరాం నుంచి పోలీసులు తెలుసుకోనున్నారు.