ఇద్దరు ఏపీ ఎంపీలకు కేంద్రం కీలక పదవులు

| Edited By: Pardhasaradhi Peri

Jul 11, 2019 | 6:57 PM

ఏపీకి చెందిన ఇద్దరు పార్లమెంట్ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం కీలక పదవులు కట్టబెట్టింది. పార్లమెంట్‌లో ఎస్టిమేట్స్ కమిటీ సభ్యులుగా వైసీపీ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి,  టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నానిలకు సభ్యత్వం కల్పించింది. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. ఎస్టిమేట్స్ కమిటీ సభ్యుల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన మొత్తం 29 మంది ఎంపీలు ఉన్నారు. మొత్తం 31 మంది నామినేషన్ వేయగా.. ఇద్దరు నామినేషన్ విత్ […]

ఇద్దరు ఏపీ ఎంపీలకు కేంద్రం కీలక పదవులు
Follow us on

ఏపీకి చెందిన ఇద్దరు పార్లమెంట్ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం కీలక పదవులు కట్టబెట్టింది. పార్లమెంట్‌లో ఎస్టిమేట్స్ కమిటీ సభ్యులుగా వైసీపీ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి,  టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నానిలకు సభ్యత్వం కల్పించింది. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది.

ఎస్టిమేట్స్ కమిటీ సభ్యుల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన మొత్తం 29 మంది ఎంపీలు ఉన్నారు. మొత్తం 31 మంది నామినేషన్ వేయగా.. ఇద్దరు నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. కేంద్ర వార్షిక బడ్జెట్ అంచనాలను పరిశీలించి, వ్యయంలో పొదుపు చర్యల కోసం ఈ కమిటీ ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేస్తుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు ఈ కమిటీ కొనసాగుతుంది.