యస్..బీజేపీ పిలిచింది..ఆలోచిస్తున్నాం

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి బీజేపీ నుంచి ఇన్విటేషన్ వచ్చిందనే వార్త గత కొద్ది రోజులుగా హల్‌చల్ చేస్తుంది. ఈ విషయంపై ఇప్పటివరకు ఆయన దాటవేత ధోరణిలోనే ముందుకు వెళ్లారు. తాజాగా కుండబద్దలు కొట్టారు జేసీ. బీజేపీ నుంచి తనకు ఆహ్వనం వచ్చిన మాట నిజమేనని తెలిపారు. అసెంబ్లీ లాబీల్లో ఇవాళ ఆయన విలేఖరులతో ముచ్చటించారు. బీజేపీ నుంచి ఆఫర్‌ వచ్చిందని.. కానీ..ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని వారితో తెలిపినట్టు చెప్పారు. ఢిల్లీలో పర్యటనలో […]

యస్..బీజేపీ పిలిచింది..ఆలోచిస్తున్నాం

Updated on: Jun 17, 2019 | 2:40 PM

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి బీజేపీ నుంచి ఇన్విటేషన్ వచ్చిందనే వార్త గత కొద్ది రోజులుగా హల్‌చల్ చేస్తుంది. ఈ విషయంపై ఇప్పటివరకు ఆయన దాటవేత ధోరణిలోనే ముందుకు వెళ్లారు. తాజాగా కుండబద్దలు కొట్టారు జేసీ. బీజేపీ నుంచి తనకు ఆహ్వనం వచ్చిన మాట నిజమేనని తెలిపారు. అసెంబ్లీ లాబీల్లో ఇవాళ ఆయన విలేఖరులతో ముచ్చటించారు. బీజేపీ నుంచి ఆఫర్‌ వచ్చిందని.. కానీ..ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని వారితో తెలిపినట్టు చెప్పారు.

ఢిల్లీలో పర్యటనలో ఏపీ సీఎం జగన్‌ హుందాగా వ్యవహరించారన్న జేసీ.. పులివెందుల నుంచి వచ్చిన వ్యక్తి ఇలా ఉంటాడని తాను అనుకోలేదని అన్నారు. తాను భయపడి జగన్‌ను పొగడడం లేదని, ఆయన తీరు నచ్చే ప్రశంసిస్తున్నానని స్పష్టం చేశారు. ప్రభుత్వం పనితీరు తెలియడానికి ఆరు నెలలు పడుతుందని.. సమయం జగన్‌కు ఇవ్వాలన్న జేసీ.. చంద్రబాబుకు కూడా అదే చెప్పానని అన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us