Pawan Kalyan: టీడీపీ ఆఫీసులపై వరుస దాడులను ఖండించిన జనసేనాని.. ఏమన్నారంటే.!

ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. టీడీపీ కార్యాలయాలపై వరుస దాడులు నేపధ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య..

Pawan Kalyan: టీడీపీ ఆఫీసులపై వరుస దాడులను ఖండించిన జనసేనాని.. ఏమన్నారంటే.!
Pawan Kalyan

Updated on: Oct 19, 2021 | 8:33 PM

ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. టీడీపీ కార్యాలయాలపై వరుస దాడులు నేపధ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య అగ్గి రాజుకుంది. ఇక టీడీపీ ఆఫీసులపై వరుస దాడులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. టీడీపీ ఆఫీసులపై వరుస దాడులను ఆయన ఖండించారు.

ఇలాంటి దాడులు రాష్ట్రానికి మంచిది కాదని స్పష్టం చేశారు. అరాచకానికి ఆంధ్రప్రదేశ్ కేరాఫ్‌గా మారిందని.. ఇలాంటి పోకడలను వెంటనే నియంత్రించాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీ చరిత్రలో ఇలాంటి దాడులు ఎప్పుడూ జరగలేదన్న ఆయన.. ప్రజాస్వామ్యానికి ఇలాంటి దాడులు మంచిది కాదని వెల్లడించారు. ఇలాంటి దాడులు అరాచకాలకు దారి తీస్తాయని.. ఈ దాడులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నారు. ఈ దాడులకు పాల్పడినవారిని వెంటనే శిక్షించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా చూడాలని పవన్ కళ్యాణ్ కోరారు.