ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ రెండు రోజులపాటు విశాఖలో పర్యటించనున్నారు. ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖ చేరుకోనున్నారు. తొలిరోజు విశాఖలో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఇక గురువారం ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించి, వీసీతో భేటీ అవుతారు. అనంతరం, విశాఖ పోర్టు ట్రస్టును సందర్శించి అక్కడ జరుగుతున్న కార్యకలాపాలను పరిశీలిస్తారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.