శివ ప్రసాద్ ఆరోగ్యంపై మనవడి క్లారిటీ

చిత్తూరు మాజీ ఎంపీ శివ ప్రసాద్ ఆరోగ్యంపై వదంతులు వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆయన మనవడు స్పందించాడు. ఆయన ఆరోగ్యం బాలేదంటూ వచ్చిన వార్తలను నమ్మొద్దని అతడు కోరాడు. ఆరోగ్యం బాగాలేకపోవడంతో వారం రోజుల క్రితం తమ తాతయ్యను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించామని.. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని తెలిపాడు. తమ తాతయ్య ఆరోగ్యం మెరుగుపడాలని దేవుడిని ప్రార్థించాలని ఈ సందర్భంగా అభిమానులను కోరారు. ఈ మేరకు అతడు ఓ వీడియోను విడుదల చేశాడు. కాగా గత […]

శివ ప్రసాద్ ఆరోగ్యంపై మనవడి క్లారిటీ

Updated on: Sep 21, 2019 | 11:50 AM

చిత్తూరు మాజీ ఎంపీ శివ ప్రసాద్ ఆరోగ్యంపై వదంతులు వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆయన మనవడు స్పందించాడు. ఆయన ఆరోగ్యం బాలేదంటూ వచ్చిన వార్తలను నమ్మొద్దని అతడు కోరాడు. ఆరోగ్యం బాగాలేకపోవడంతో వారం రోజుల క్రితం తమ తాతయ్యను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించామని.. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని తెలిపాడు. తమ తాతయ్య ఆరోగ్యం మెరుగుపడాలని దేవుడిని ప్రార్థించాలని ఈ సందర్భంగా అభిమానులను కోరారు. ఈ మేరకు అతడు ఓ వీడియోను విడుదల చేశాడు. కాగా గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శివ ప్రసాద్ శుక్రవారం చనిపోయారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలను ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు. శివ ప్రసాద్ చికిత్సకు స్పందిస్తున్నారని వారు పేర్కొన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us