APSRTC Bus catches fire : ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఆర్టీసీ డిపోలో బస్సులో నుంచి ఉన్నఫళంగా మంటలు ఎగసిపడ్డాయి. బస్సులోని బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు వ్యాపించి క్రమంగా బస్సు అంతటికీ వ్యాపించాయి. ఈ క్రమంలో బస్సు మొత్తం అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే స్పాట్ కు చేరుకుని ఫైర్ ఇంజన్ ద్వారా మంటలు ఆర్పారు.
అయితే, ఘటనపై ఆర్టీసీ యాజమాన్యం ఆరా తీస్తుండగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన సమయంలో మరిన్ని బస్సులు అదే ప్రాంతంలో ఉన్నాయి. అయితే అదృష్టవశాత్తూ వేరే బస్సులకు మంటలు వ్యాపించకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
గుంటూరు నగరంలో కురిసిన భారీ వర్షానికి డ్రైన్ లో కొట్టుకుపోయిన బాలుడు
గుంటూరు నగరంలో నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నగరంలోని డ్రెయిన్లు పొంగిపొర్లాయి. ఈ వర్ష బీభత్సానికి పీకల వాగు కూడా పొంగిపొర్లింది. ఈ క్రమంలో శివరాం నగర్ లో నివసించే పుల్లయ్య, మంగమ్మల రెండో కొడుకు కాలువ ఒడ్డున ఆడుకుంటూ డ్రెయిన్ లో పడిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన వెంకటేష్ అన్నయ్య తల్లి దండ్రులకు చెప్పాడు.
అయితే, డ్రెయిన్ వేగంగా ప్రవహిస్తుండటంతో అప్పటికే బాలుడు డ్రైన్ లో కొట్టుకుపోయాడు. బాలుడి ఆచూకి కోసం ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం రంగంలోకి దిగి గాలింపు చేపట్టింది. నగర మేయర్ కావటి మనోహర్ గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఘటన నిన్న సాయంత్రం ఐదుగంటల సమయంలో జరిగినప్పటికీ ఇప్పటి వరకూ బాలుడు జాడ తెలియరాలేదు. మరోవైపు, బాలుడి తల్లిదండ్రులు చిన్నారి కోసం కన్నీటి పర్యంతమవుతున్నారు.
Read also : YS Sharmila : మహానేతను కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా సహించేదిలేదు.. ఖబడ్దార్ : వైయస్ షర్మిల