Fire in Rajahmundry : కొత్త సంవత్సరం వేళ రాజమండ్రిలోని ఓ షాప్‌లో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

Fire in Rajahmundry: నూతన సంవత్సరం వేళ ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

Fire in Rajahmundry : కొత్త సంవత్సరం వేళ రాజమండ్రిలోని ఓ షాప్‌లో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

Updated on: Jan 01, 2021 | 7:09 AM

Fire in Rajahmundry: నూతన సంవత్సరం వేళ ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం శారద నగర్‌లో స్క్రాబ్ షెడ్‌లో తారాజువ్వలు పడి అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో నివాసాల మధ్య మంటలు ఎగిసిపడుతున్నాయి. గమనించిన స్థానికులు భయంతో పరుగులు తీస్తున్నారు. వెంటనే ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించగా హుటాహుటినా సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. కాగా దట్టమైన పొగ అలుముకోవడంతో ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. పరిసర ప్రదేశాలన్ని పొగతో నిండిపోవడంతో జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాగా ఇప్పటి వరకు ఎంతమేరకు ఆస్తినష్టం జరిగిందో తెలియరాలేదు.