రాజధాని సెగలు.. అమరావతిలో హైటెన్షన్

| Edited By:

Dec 27, 2019 | 7:30 AM

ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు చేస్తోన్న పోరాటం పదో రోజు కొనసాగుతోంది. రాజధానిని మార్చకండి అంటూ రోజుకో వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేస్తోన్న రైతులు.. ఇవాళ రహదారిపై మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగనున్నాయి. ఉద్దండరాయినిపాలెం శంకుస్థాపన ప్రదేశంలో ఉదయం నుంచి రైతులు నిరసన తెలుపుతున్నారు. మరోవైపు ఈ రోజు ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ […]

రాజధాని సెగలు.. అమరావతిలో హైటెన్షన్
Follow us on

ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు చేస్తోన్న పోరాటం పదో రోజు కొనసాగుతోంది. రాజధానిని మార్చకండి అంటూ రోజుకో వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేస్తోన్న రైతులు.. ఇవాళ రహదారిపై మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగనున్నాయి. ఉద్దండరాయినిపాలెం శంకుస్థాపన ప్రదేశంలో ఉదయం నుంచి రైతులు నిరసన తెలుపుతున్నారు.

మరోవైపు ఈ రోజు ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాజధానిపై తుది నిర్ణయాన్ని తీసుకోనున్నారు. అలాగే రాజధాని రైతులకు ఊరట కలిగించే విధంగా పలు నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక కేబినెట్ భేటీ నేపథ్యంలో విజయవాడతో పాటు గుంటూరు నుంచి సచివాలయానికి వెళ్లే అన్ని దారులను దిగ్బంధం చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌తో పాటు సచివాలయానికి వెళ్లే అన్ని దారులను జల్లెడపడుతున్నారు. తుళ్లూరు మండలంలోని అన్ని గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. సచివాలయం చుట్టుపక్కల పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. మందడం, మల్కాపురం జంక్షన్ల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు బలగాలను ఇప్పటికే రంగంలోకి దింపారు.