యరపతినేని చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం..?

తెలుగుదేశం పార్టీ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గుంటూరు జిల్లాలో మైనింగ్ అక్రమాల కేసులో ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కాగా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు యరపతినేని ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున సున్నపురాయి నిక్షేపాలను అక్రమంగా తరలించారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. దీనిపై ఇటీవల పిడుగురాళ్లకు చెందిన గురువాచారి అనే వ్యక్తి […]

యరపతినేని చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం..?

Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 05, 2019 | 9:45 AM

తెలుగుదేశం పార్టీ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గుంటూరు జిల్లాలో మైనింగ్ అక్రమాల కేసులో ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కాగా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు యరపతినేని ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున సున్నపురాయి నిక్షేపాలను అక్రమంగా తరలించారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. దీనిపై ఇటీవల పిడుగురాళ్లకు చెందిన గురువాచారి అనే వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే అధికారుల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో ఆయన నేరుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను గత కొంతకాలంగా విచారిస్తున్న హైకోర్టు.. తాజాగా యరపతినేనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో అతడితో పాటు అనుచరులను అరెస్ట్ చేయాలంటూ ఆదేశించింది.

కాగా సున్నపురాయి నిక్షేపాల అక్రమ మైనింగ్‌కు సంబంధించి అప్పట్లో వైసీపీ తరఫున ఓ నిజనిర్ధారణ కమిటీ పల్నాడులో పర్యటించింది. వారిని యరపతినేని అనుచరులు అడ్డుకున్నారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాన తన అరెస్ట్‌ను ముందే ఊహించిన యరపతినేని.. ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఈ బెయిల్ పిటిషన్ కేసు ఓ కోర్టులో పెండింగ్‌లో ఉండగా.. మరో కోర్టులో ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.