రూ. 10వేలు జీవనభృతి కొరకు మంత్రి ఇంటి ముందు ధర్నా

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కారు. సీఐటీయూ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ మంత్రి ఇంటి ముందు ధర్నా నిర్వహించారు.

రూ. 10వేలు జీవనభృతి కొరకు మంత్రి ఇంటి ముందు ధర్నా

Edited By:

Updated on: Sep 28, 2020 | 5:15 PM

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కారు. సీఐటీయూ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు జిల్లా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఇంటి ముందు ధర్నా నిర్వహించారు.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జిల్లా వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు. నిర్మాణ రంగానికి చెందిన కార్మికులు, కూలీల సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ కార్మికసంఘాల నేతలు, కూలీలు పెద్ద సంఖ్యలో ఈ నిరసనలో పాల్గొన్నారు. పనులు కోల్పోయిన భవననిర్మాణ కార్మికులకు రూ.10వేలు జీవనభృతి చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

జిల్లాలో పెండింగులో ఉన్న సంక్షేమబోర్డు పరిహారం నిధులు రూ. 5కోట్లు కార్మికుల ఖాతాలలో జమచేయాలని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం వైస్సార్ భీమా పేరుతో, మిగులు నిధుల పేరుతో పక్కదారి పట్టించిన సంక్షేమబోర్డు నిధులు రూ. 830కోట్లు తిరిగి బోర్డుకి చెల్లించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వమే సంక్షేమ బోర్డు నిధులను ఇతర అవసరాలకు వాడుకోవడం అన్యాయం అంటూ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఇంటిముందు కార్మిక నాయకులు ధర్నాచేపట్టారు.