Sajjala : సంచార జాతులకు ప్రాధాన్యం ఇచ్చిన మొట్టమొదటి నాయకుడు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి : సజ్జల

సంచార జాతులకు ప్రాధాన్యం ఇచ్చిన మొట్ట మొదటి నాయకుడు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని చెప్పారు వైయ‌స్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి..

Sajjala : సంచార జాతులకు ప్రాధాన్యం ఇచ్చిన మొట్టమొదటి నాయకుడు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి : సజ్జల
Sajjala Ramakrishna Reddy

Updated on: Jul 20, 2021 | 9:05 PM

Sajjala Ramakrishna Reddy – Cm Jagan : సంచార జాతులకు ప్రాధాన్యం ఇచ్చిన మొట్ట మొదటి నాయకుడు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్మోహన్‌రెడ్డి అని చెప్పారు వైయ‌స్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను సీఎం వైయ‌స్‌ జగన్‌ అమలు చేస్తున్నారని చెప్పిన సజ్జల.. వాటిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఇవాళ తాడేపల్లిలోని వైయ‌స్ఆర్ సీపీ సెంట్రల్ ఆఫీస్ లో నిర్వహించిన రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ సమావేశంలో సజ్జల ఈ వ్యాఖ్యలు చేశారు. సమాజం పైనా, ప్రజలపైనా సీఎం జగన్‌కు ప్రేమ ఉండటం వల్లే సంచార జాతుల అభ్యున్నతకి ఆస్కారం లభించిందని సజ్జల చెప్పుకొచ్చారు. చంద్రబాబు హయాంలో ఇన్ని అవకాశాలు ఎందుకు ఇవ్వలేదని సజ్జల నిలదీశారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆయన రాష్ట్రంలో విద్య, వైద్య సదుపాయల కల్పనకు సీఎం శక్తివంచనలేకుండా కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖమంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read also :  YS Sharmila: ఖమ్మం జిల్లా పెనుబల్లిలో నిరుద్యోగ నిరసన దీక్షలో వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్

Dakkili Temple Construction : అమ్మ చెప్పిన మాట కోసం ఆస్తులు అమ్మి మరీ గుడి కట్టాడు.. ఇప్పుడాయన పరిస్థితి ఎలా ఉందంటే..!