కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించండి: జగన్‌

| Edited By:

Jul 13, 2020 | 3:42 PM

వివిధ ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందించాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు

కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించండి: జగన్‌
Follow us on

వివిధ ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందించాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల స్థితిగతులపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 54 వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు గత ప్రభుత్వం చేసింది సున్నా అని జగన్ అన్నారు. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం మినిమం టైం స్కేల్‌పై హడావిడిగా జీవో జారీ చేసిందని, దాన్ని అమలు చేసే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుందని ఆయన తెలిపారు. అయితే దీని వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.1000 కోట్ల భారం పడుతుందని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో గ్రీన్ ఛానెల్లో పెట్టి వారికి నిర్ణీత సమయానికి జీతాలు అందించాలని జగన్ తెలిపారు. అంతేకాదు పర్మినెంట్‌ ఉద్యోగుల్లానే కాంట్రాక్ట్ ఉద్యోగులకు సామాజిక, ఆరోగ్య భద్రత కల్పించే దిశగా అధ్యయనం చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తనకు అందించాలని సీఎం కోరారు.