చంద్రబాబు పశ్చాత్తాపం

|

Sep 04, 2020 | 9:24 PM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జరిగిన తప్పులను నెమరువేసుకుంటూ భవిష్యత్ లో ఇలాంటివి జరగవని పార్టీ నేతలకు ఊతం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ నేతలతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు పశ్చాత్తాపం
Follow us on

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జరిగిన తప్పులను నెమరువేసుకుంటూ భవిష్యత్ లో ఇలాంటివి జరగవని పార్టీ నేతలకు ఊతం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ నేతలతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ టీడీపీ అండగా ఉంటుందని.. ఇదే సమయంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజా సమస్యలపై పోరుబాట పడుతూ ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. గతంలో అభివృద్ధి, రాష్ట్ర అభ్యున్నతికి ముఖ్య ప్రాధాన్యతనివ్వడం ద్వారా సమయాభావం వల్ల పార్టీని కాస్త నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవమేనని చంద్రబాబు అంగీకరించారు. భవిష్యత్తులో అలాంటి తప్పు జరగబోదని హామీ ఇస్తున్నానని.. అవసరాల మేరకు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తామని, అందరం కలిసి మళ్లీ అధికారంలోకి వచ్చేలా కష్టిద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు చంద్రబాబు. ఈ సందర్బంగా ఏపీలో ఉచిత విద్యుత్-నగదు బదిలీ అంశంపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు.