ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరోక్షంగా సెటైర్ వేస్తూ ట్వీట్ చేశారు. దేవుడు స్క్రిప్ట్ భలే రాశాడని.. ఎవరైతే అమరావతిని గ్రాఫిక్స్, భ్రమరావతి అంటూ అబద్ధాలు చెప్పారో.. వాళ్ల చేతనే ఇప్పుడు అక్కడ లైటింగ్ పెట్టించి దాన్ని మరింత అందంగా చూపించేలా చేశాడని పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం అమరావతిలోని సచివాలయానికి అమర్చిన విద్యుద్దీపాల అలకంరణ ఫోటోలను ఆ ట్వీట్‌లో జతచేశారు.
దేవుడు స్క్రిప్ట్ భలే రాశాడు… ఎవరైతే అమరావతిని గ్రాఫిక్స్, భ్రమరావతి అని అబద్ధాలు చెప్పారో, వాళ్ళ చేతనే ఇప్పుడు అక్కడ లైటింగ్ పెట్టించి దాన్ని మరింత అందంగా చూపించేలా చేశాడు. pic.twitter.com/aU7CV1tWZz
— N Chandrababu Naidu (@ncbn) August 15, 2019