టీడీపీ విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమ, ఆయన కుమారులు సిద్ధార్థ, రవితేజలపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో దౌర్జన్యాలకు, బెదిరింపులకు పాల్పడిన ఘటనలో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 8న విజయవాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సిద్ధార్థ, రవితేజలు.. పారిశ్రామికవేత్త కోగంటి సత్యంపై దౌర్జన్యానికి దిగారు. అంతలో అక్కడకు వెళ్లిన బోండా ఉమ ‘నీ అంతు చూస్తా’ అంటూ సత్యంపై బెదిరింపులకు దిగారు. ఈ ఘటనపై ఫిర్యాదు రావడంతో వారిపై అజిత్ సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.