బాబు రక్షణ కోసం.. జగన్ ఇంటి ముందు ఆత్మహత్యకు సిద్ధం: బుద్ధా వెంకన్న

చంద్రబాబు హత్యకు కుట్ర జరుగుతోందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో మాట్లాడిన ఆయన.. డ్రోన్ కెమెరాలతో చంద్రబాబు ఇంటి ఫొటోలు తీశారని.. చంద్రబాబు ఇంటి దగ్గర మంత్రులు రెక్కీ నిర్వహించారని ఆరోపణలు చేశారు. చంద్రబాబుపై వైసీపీ కుట్రలను ఆపాలని.. లేదంటే జగన్ ఇంటి దగ్గర ఆత్మహత్య చేసుకుంటానని ఆయన అన్నారు. ఇక చంద్రబాబు భద్రతపై ప్రధాని, హోంమంత్రికి లేఖ రాస్తానని.. బాబుకు కేంద్రమే రక్షణ కల్పించాలని ఆయన కోరారు. కాగా ఇటీవల […]

బాబు రక్షణ కోసం.. జగన్ ఇంటి ముందు ఆత్మహత్యకు సిద్ధం: బుద్ధా వెంకన్న

Edited By:

Updated on: Aug 18, 2019 | 2:22 PM

చంద్రబాబు హత్యకు కుట్ర జరుగుతోందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో మాట్లాడిన ఆయన.. డ్రోన్ కెమెరాలతో చంద్రబాబు ఇంటి ఫొటోలు తీశారని.. చంద్రబాబు ఇంటి దగ్గర మంత్రులు రెక్కీ నిర్వహించారని ఆరోపణలు చేశారు. చంద్రబాబుపై వైసీపీ కుట్రలను ఆపాలని.. లేదంటే జగన్ ఇంటి దగ్గర ఆత్మహత్య చేసుకుంటానని ఆయన అన్నారు. ఇక చంద్రబాబు భద్రతపై ప్రధాని, హోంమంత్రికి లేఖ రాస్తానని.. బాబుకు కేంద్రమే రక్షణ కల్పించాలని ఆయన కోరారు. కాగా ఇటీవల చంద్రబాబు ఇంటిపై డ్రోన్లను వినియోగించడంపై వివాదం మొదలైంది. దీనిపై అధికార, విపక్షాలు ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకుంటుండగా.. ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.