AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కృష్ణానదికి తగ్గుతున్న వరద ఉధృతి

ఎట్టకేలకు కృష్ణానదికి వరద ఉధృతి దగ్గింది. ఆదివారం ఉదయం ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే వరద ప్రవాహం 6.26 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. ఆదివారం నుంచి ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రవాహం తగ్గుతూ కనిపించింది. పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గడంతో కృష్ణా నదిలో ఎగువన వరద ప్రవాహం తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటిమట్టంతో 3.07 టీఎంసీ నీరు నిల్వ ఉంది. మరోవైపు ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల్లో శనివారం వరద ప్రవాహం తగ్గిన […]

కృష్ణానదికి తగ్గుతున్న వరద ఉధృతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 18, 2019 | 12:11 PM

Share

ఎట్టకేలకు కృష్ణానదికి వరద ఉధృతి దగ్గింది. ఆదివారం ఉదయం ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే వరద ప్రవాహం 6.26 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. ఆదివారం నుంచి ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రవాహం తగ్గుతూ కనిపించింది. పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గడంతో కృష్ణా నదిలో ఎగువన వరద ప్రవాహం తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటిమట్టంతో 3.07 టీఎంసీ నీరు నిల్వ ఉంది.

మరోవైపు ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల్లో శనివారం వరద ప్రవాహం తగ్గిన నేపథ్యంలో ప్రవాహంలో తగ్గుదల కనిపించింది. బ్యారేజీ నుంచి విడుదలవుతున్న నీటిని తూర్పు డెల్టాకు 9467 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 8 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజీలో నిల్వ సామర్థ్యం కంటే అధికంగా నీరు ఉండటంతో 70 గేట్లు ఎత్తి 6 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి వరద ప్రవాహం ఆరు లక్షల క్యూసెక్కులకు తగ్గే అవకాశం ఉన్నట్లు బ్యారేజీ కన్జర్వేటర్‌ తెలిపారు.

కృష్ణా జిల్లాలో వరద ముంపు ప్రాంతాల్లో పలువురు నేతలు పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

Follow Us
AP, తెలంగాణ తపాలా ఉద్యోగాలకు 2026 ఎంపికైన వారి జాబితా వచ్చేసింది
AP, తెలంగాణ తపాలా ఉద్యోగాలకు 2026 ఎంపికైన వారి జాబితా వచ్చేసింది
పిల్లల ఇంటెలిజెన్స్‌ని గుర్తించడంలో తల్లిదండ్రులు చేసే పొరపాట్లు
పిల్లల ఇంటెలిజెన్స్‌ని గుర్తించడంలో తల్లిదండ్రులు చేసే పొరపాట్లు
జిమ్ వర్కవుట్లు వద్దు.. పైలేట్స్ ముద్దంటున్న జాన్వీ కపూర్
జిమ్ వర్కవుట్లు వద్దు.. పైలేట్స్ ముద్దంటున్న జాన్వీ కపూర్
EMIలపై ఐఫోన్‌ కొంటున్నారా? పెద్ద తప్పు చేస్తున్నట్లే..
EMIలపై ఐఫోన్‌ కొంటున్నారా? పెద్ద తప్పు చేస్తున్నట్లే..
బంగారం కొనాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే
బంగారం కొనాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే
నోరులేని జీవుల ‘ఆత్మహత్య’ వెనుక ఉన్న కన్నీటి గాథలివే!
నోరులేని జీవుల ‘ఆత్మహత్య’ వెనుక ఉన్న కన్నీటి గాథలివే!
టెన్త్ అర్హతతో రైల్వేలో 22,195 ఉద్యోగాలు.. మరికొన్ని గంటలే ఛాన్స్
టెన్త్ అర్హతతో రైల్వేలో 22,195 ఉద్యోగాలు.. మరికొన్ని గంటలే ఛాన్స్
ఫ్లెక్సిటేరియన్.. జీర్ణ సమస్యలకు చెక్.. రోగనిరోధక శక్తికి బూస్ట్!
ఫ్లెక్సిటేరియన్.. జీర్ణ సమస్యలకు చెక్.. రోగనిరోధక శక్తికి బూస్ట్!
ఆ ఛార్జీలు తగ్గించాలని సూచనలు జారీ!
ఆ ఛార్జీలు తగ్గించాలని సూచనలు జారీ!
హాలీవుడ్‌నే కాదు..విమానం నడుపుతూ ఆకాశంలోనూ చక్కర్లు కొట్టేస్తుంది
హాలీవుడ్‌నే కాదు..విమానం నడుపుతూ ఆకాశంలోనూ చక్కర్లు కొట్టేస్తుంది