జగన్ సర్కార్‌ది పిరికిపంద చర్య: బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

అన్యమతస్తుడైన ఏపీ ముఖ్యమంత్రి హిందూ దేవాలయాలపై జరుగుతోన్న దాడులకి స౦బ౦ధించి మాట్లాడాలని డిమాండ్ చేసారు ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ మాధవ్. 'ఛలో అమలాపురం' కార్యక్రమంపై ప్రభుత్వం పిరికిపంద చర్యలకు పోయి..

జగన్ సర్కార్‌ది పిరికిపంద చర్య:  బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

Edited By:

Updated on: Sep 18, 2020 | 10:17 PM

అన్యమతస్తుడైన ఏపీ ముఖ్యమంత్రి హిందూ దేవాలయాలపై జరుగుతోన్న దాడులకి స౦బ౦ధించి మాట్లాడాలని డిమాండ్ చేసారు ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ మాధవ్. ‘ఛలో అమలాపురం’ కార్యక్రమంపై ప్రభుత్వం పిరికిపంద చర్యలకు పోయి, పార్టీ శ్రేణులను ఎక్కడికక్కడే నిర్భందించడం సిగ్గుచేటన్నారు.

ఈ విధంగా ప్రభుత్వం నోరునొక్కే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అంతర్వేది  ఘటనపై నిరసన తెలియజేసిన వారిపై ప్రభుత్వం 8 కేసులు వరకు బనాయించిందన్నారు. ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

‘ఛలో అమలాపురం’ కార్యక్రమం ముగి౦చుకుని విశాఖకి తిరుగు ప్రయాణంలో ఆయన నర్సీపట్నంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అబీద్ సెంటర్ వరకు జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు.