ఎమ్మెల్సీగా అశోక్‌బాబు ప్రమాణం

|

Apr 17, 2019 | 1:36 PM

అమరావతి: శాసనమండలిలో ఎమ్యెల్సీగా అశోక్ బాబు ప్రమాణం చేశారు. ఆయన చేత మండలి ఛైర్మన్ షరీఫ్ ప్రమాణం చేయించారు. అనంతరం ఆయనకు శాసన మండలికి సంబంధించిన నిబంధనల పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్,  పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు. గతంలో  ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన అశోక్ బాబు.. సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విషయం […]

ఎమ్మెల్సీగా అశోక్‌బాబు ప్రమాణం
Follow us on

అమరావతి: శాసనమండలిలో ఎమ్యెల్సీగా అశోక్ బాబు ప్రమాణం చేశారు. ఆయన చేత మండలి ఛైర్మన్ షరీఫ్ ప్రమాణం చేయించారు. అనంతరం ఆయనకు శాసన మండలికి సంబంధించిన నిబంధనల పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్,  పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు. గతంలో  ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన అశోక్ బాబు.. సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.