ముగిసిన రాజ్యసభ పోలింగ్… ఓటువేసిన 173 మంది ఎమ్మెల్యేలు

ఏపీ అసెంబ్లీలో రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. పోలింగ్ చివరి సమయం వరకు అధికార, విపక్షాలకు చెందిన మొత్తం 173 మంది శాసన సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ముగిసిన రాజ్యసభ పోలింగ్... ఓటువేసిన 173 మంది ఎమ్మెల్యేలు

Edited By:

Updated on: Jun 19, 2020 | 4:41 PM

ఏపీ అసెంబ్లీలో రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. పోలింగ్ చివరి సమయం వరకు అధికార, విపక్షాలకు చెందిన మొత్తం 173 మంది శాసన సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారిలో చీరాల శాసన సభ్యుడు కరణం బలరాం, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాల గిరిలు కూడా ఉన్నారు. మరికాసేపట్లో కౌంటింగ్ నిర్వహిస్తారు. ఇక టీడీపీకి చెందిన టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి ఓటు వేసేందుకు అనుమతి లభించలేదు. అలాగే రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ హోమ్‌ క్వారంటైన్‌లో ఉండటం కారణంగా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.