‘ఛలో అంతర్వేది’ అరెస్టులు సబబే : మంత్రి విశ్వరూప్

|

Sep 18, 2020 | 3:18 PM

తూర్పుగోదావరి జిల్లా 'ఛలో అంతర్వేది' ర్యాలీ సందర్భంగా చేసిన అరెస్టులను మంత్రి విశ్వరూప్ సమర్థించుకున్నారు. పోలీసుల సమక్షంలో చర్చిల పై రాళ్ల దాడి చేసిన వాళ్ళు ప్రత్యక్షంగా దొరికారు కాబట్టే అరెస్టు చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు.

ఛలో అంతర్వేది అరెస్టులు సబబే : మంత్రి విశ్వరూప్
Follow us on

తూర్పుగోదావరి జిల్లా ‘ఛలో అంతర్వేది’ ర్యాలీ సందర్భంగా చేసిన అరెస్టులను మంత్రి విశ్వరూప్ సమర్థించుకున్నారు. పోలీసుల సమక్షంలో చర్చిల పై రాళ్ల దాడి చేసిన వాళ్ళు ప్రత్యక్షంగా దొరికారు కాబట్టే అరెస్టు చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు. జగన్ సర్కారుకి హిందు దేవాలయం అయినా, చర్చి అయినా, మసీదు అయినా సమానమే అని ఆయన పేర్కొన్నారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనపై, మంత్రులు, ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారని.. అనంతరం సీబీఐ ఎంక్వైరీ వెయ్యమని కేంద్రాన్ని కోరామని వివరించారు. ఇక ప్రతిపక్షాలకు ధర్నాలు, ఛలో అంతర్వేది పిలుపు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. రథం దగ్ధం పై విచారణ పూర్తయి సాక్ష్యాలతో బయట పడిన తర్వాత దోషులను శిక్షిస్తామన్నారు. ప్రముఖమైన దేవాలయాలకు సెక్యూరిటీ అనేది ప్రభుత్వం ఇస్తుంది.. రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలకు సెక్యూరిటీ ఇవ్వాలంటే ప్రభుత్వానికి సాధ్యం కాదని మంత్రి తెలిపారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనలో కుట్ర ఏంటనేది త్వరలోనే తెలుస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు.