Krosuru Polytechnic : ఆ పాలిటెక్నిక్ కళాశాల మీద మాజీ ఎమ్మెల్యే కాస్తైనా దృష్టి పెట్టక ఈ దుస్థితి : మంత్రి ఆదిమూలపు, ఎమ్మెల్యే అంబటి

|

Jun 29, 2021 | 3:45 PM

: గుంటూరు జిల్లా క్రోసూరు లోని పాలిటెక్నిక్ కళాశాల యేళ్ళ తరబడి పరిమిత గదులలో నడుస్తుండటం బాధాకరమని విద్యాశాఖ మంత్రి..

Krosuru Polytechnic : ఆ పాలిటెక్నిక్ కళాశాల మీద మాజీ ఎమ్మెల్యే కాస్తైనా దృష్టి పెట్టక ఈ దుస్థితి : మంత్రి ఆదిమూలపు, ఎమ్మెల్యే అంబటి
Ambati And Adimulapu
Follow us on

Adimulapu and Ambati on Krosuru Polytechnic college : గుంటూరు జిల్లా క్రోసూరు లోని పాలిటెక్నిక్ కళాశాల యేళ్ళ తరబడి పరిమిత గదులలో నడుస్తుండటం బాధాకరమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. మాజీ ఎమ్మెల్యే స్వప్రయోజనాల మీద పెట్టిన దృష్టి కొంతైనా ఈ కళాశాలకు శాశ్వత భవన నిర్మాణానికి సారించి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో ఎట్టిపరిస్థితుల్లోనూ క్రోసూరు పాలిటెక్నిక్ కాలేజ్ లో నూతన భవన సముదాయంలోనే వృత్తివిద్యా కోర్సులను కూడా ప్రవేశపెడతామని మంత్రి తెలిపారు.

రాష్ట్రంలోని ప్రతి పిల్లవాడికి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన అమ్మఓడి, విద్యాదీవెన, వసతిదీవెన వంటి కార్యక్రమాలతో సీఎం అక్కచెల్లమ్మల కుటుంబాలలో తోబుట్టువుగా మారిపోయారని.. విద్యావ్యవస్థలో పరీక్షల విలువ తెలియని అసమర్థ ప్రతిపక్ష నాయకులు పరీక్షలు రద్దు చేయాలని దీక్షలు చేయడం వాళ్ళ అజ్ఞానానికి నిదర్శనమని టీడీపీ మీద విమర్శలు చేశారు మంత్రి ఆదిమూలపు.

మరోవైపు, క్రోసూరు పాలిటెక్నిక్ కాలేజీ గురించి అంబటి రాంబాబు కామెంట్స్ చేశారు. క్రోసూరులో యేళ్ళ తరబడి మరుగున పడిన పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణం కొరకు స్థానిక ఎమ్మెల్యే శంకరరావు చేసి కృషి అభినందనీయమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పిల్లల చదువుల కొరకు అమ్మఓడి వంటి పథకం ప్రారంభించిన ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదేనని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాసంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రెండు కళ్ళతో చూడలేని చంద్రబాబు సాధన దీక్షతో చేస్తున్న దీక్షలు ఎందుకో ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. విజ్ఞత కలిగిన రాష్ట్ర ప్రజలు సాధన దీక్షతో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ చెప్తున్న మాటలను వినేందుకు సిద్ధంగా లేరన్నారు అంబటి.

Read also : BJP MP Aravind: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌కి ఝలక్..! ‘ఇకపై ఆ గ్రామాల్లోనే పర్యటిస్తా.. ఎవరు అడ్డుకుంటారో చూస్తా!’