AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రశాంతంగా పల్నాడు.. మీడియాతో హోం మంత్రి సుచరిత

పల్నాడు ప్రాంతంలో ఎలాంటి అలజడులు లేకుండా ప్రశాంతంగా ఉందన్నారు ఏపీ హోం మంత్రి సుచరిత. గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎలాంటి ఇబ్బందులు లేవని, ప్రతిపక్ష టీడీపీ కావాలనే రాద్ధాంతం చేస్తుందని విమర్శించారు. పల్నాడు గ్రామాల్లో ఉండలేని పరిస్థితులు ఉన్నాయంటూ, బాధితులంతా పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారని టీడీపీ దుష్ర్పచారం చేస్తోందని మండిపడ్డారు హోం మంత్రి. ఒకవేళ అదేపరిస్థితి ఉంటే ప్రజలు స్వేచ్ఛగా శాంతిభద్రతలతో జీవించే ఏర్పాట్లు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. పల్నాడు ప్రాంతంలో […]

ప్రశాంతంగా పల్నాడు.. మీడియాతో హోం మంత్రి సుచరిత
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 09, 2019 | 5:44 PM

Share

పల్నాడు ప్రాంతంలో ఎలాంటి అలజడులు లేకుండా ప్రశాంతంగా ఉందన్నారు ఏపీ హోం మంత్రి సుచరిత. గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎలాంటి ఇబ్బందులు లేవని, ప్రతిపక్ష టీడీపీ కావాలనే రాద్ధాంతం చేస్తుందని విమర్శించారు.

పల్నాడు గ్రామాల్లో ఉండలేని పరిస్థితులు ఉన్నాయంటూ, బాధితులంతా పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారని టీడీపీ దుష్ర్పచారం చేస్తోందని మండిపడ్డారు హోం మంత్రి. ఒకవేళ అదేపరిస్థితి ఉంటే ప్రజలు స్వేచ్ఛగా శాంతిభద్రతలతో జీవించే ఏర్పాట్లు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. పల్నాడు ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించవద్దంటూ సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఎన్నికత తర్వాత ఇప్పటివరకు 46 మందిపై రౌడీ షీట్లు, 36 మందిపై సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేసినట్టు మంత్రి వివరించారు. ఇక్కడ నమోదైన రాజకీయ కేసులన్నీ ఎస్పీ ఆధ్వర్యంలో సమీక్షిస్తున్నట్టు మంత్రి సుచరిత తెలియజేశారు.

పల్నాడు, గురజాల ప్రాంతాల్లో అధికార వైసీపీ నేతలు ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అనుచరుల దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారంటూ టీడీపీ ఆరోపణలు చేస్తోంది. వైసీపీకి చెందిన వారు టీడీపీ కార్యకర్తలు, సానుభూతి పరులపై అకారణంగా భౌతిక దాడులకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. దీనికోసం టీడీపీ ఆధ్వర్యంలో పునరావాస శిబిరాలు కూడా ఏర్పాటు చేసింది. వీటికి పోటీగా వైసీపీ కూడా గత ప్రభత్వం హాయంలో తమ కార్యకర్తలపై జరిగిన దాడుల్లో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారి కోసం పునరావాస శిబిరాన్నిఏర్పాటు చేసింది.

పల్నాడు ప్రాంతంలో గత కొంతకాలంగా ఇటువంటి శిబిరాలు ఏర్పాటు చేయడంతో ఇరు పార్టీల్లో రాజకీయ వేడి రగులుకుంది. రెండు రోజుల క్రితం హోం మంత్రి సుచరిత సైతం పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ప్రతిపక్ష టీడీపీ కావాలనే ఆరోపణలు చేస్తుందని, ఇక్కడ ప్రజలంతా  ప్రశాంతంగా ఉన్నారని తెలిపారు.

Follow Us
బీపీని 24 గంటలు టెస్ట్ చేసే స్మార్ట్‌వాచ్ కావాలా?
బీపీని 24 గంటలు టెస్ట్ చేసే స్మార్ట్‌వాచ్ కావాలా?
ఈ పండ్లు రోజుకు 10 తింటే చాలు, రుచికి రుచి..ఆరోగ్యానికి బోలెడన్ని
ఈ పండ్లు రోజుకు 10 తింటే చాలు, రుచికి రుచి..ఆరోగ్యానికి బోలెడన్ని
వర్షం తర్వాత వచ్చే వాసన పోవాలంటే.. ఇలా చేయండి!
వర్షం తర్వాత వచ్చే వాసన పోవాలంటే.. ఇలా చేయండి!
.. ఇలా పిండి కలిపితే మెత్తటి దూది లాంటి ఇడ్లీ సిద్ధం..
.. ఇలా పిండి కలిపితే మెత్తటి దూది లాంటి ఇడ్లీ సిద్ధం..
బూడిద గుమ్మడికాయను ఇలా కడుతున్నారా? దిష్టి పోవాలంటే ఈ నియమాలు..
బూడిద గుమ్మడికాయను ఇలా కడుతున్నారా? దిష్టి పోవాలంటే ఈ నియమాలు..
సరికొత్త డిజైన్‌తో మార్కెట్‌లోకి టాటా నెక్సాన్.. వివరాలివే
సరికొత్త డిజైన్‌తో మార్కెట్‌లోకి టాటా నెక్సాన్.. వివరాలివే
గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసి, తల్లి అప్పు తీర్చడానికి సినిమాల్లో
గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసి, తల్లి అప్పు తీర్చడానికి సినిమాల్లో
నాటకంలో రోల్ కోసం పోటీ పడిన పాములు! ప్రిన్సెస్‌కు దక్కిన అవకాశం?
నాటకంలో రోల్ కోసం పోటీ పడిన పాములు! ప్రిన్సెస్‌కు దక్కిన అవకాశం?
షియోమీ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ వాచ్‌.. 21 రోజుల బ్యాటరీ లైఫ్..
షియోమీ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ వాచ్‌.. 21 రోజుల బ్యాటరీ లైఫ్..
పిచ్చెక్కించే ఫీచర్లతో వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. సీక్రెట్‌ ఏంటి
పిచ్చెక్కించే ఫీచర్లతో వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. సీక్రెట్‌ ఏంటి