Srikanth Reddy: ప్రాజెక్టులు నీటితో తొణికిసలాడుతుంటే.. చంద్రబాబు కంట్లో నీళ్లు తిరుగుతాయి: గడికోట శ్రీకాంత్‌రెడ్డి

|

Jul 30, 2021 | 5:02 PM

ప్రాజెక్టులు నీటితో తొణికిసలాడుతుంటే, టీడీపీ అధినేత చంద్రబాబు కంట్లో నీళ్లు వస్తాయని వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు...

Srikanth Reddy: ప్రాజెక్టులు నీటితో తొణికిసలాడుతుంటే.. చంద్రబాబు కంట్లో నీళ్లు తిరుగుతాయి:  గడికోట శ్రీకాంత్‌రెడ్డి
Srikanth Reddy
Follow us on

Srikanth Reddy – Chandrababu: ప్రాజెక్టులు నీటితో తొణికిసలాడుతుంటే, టీడీపీ అధినేత చంద్రబాబు కంట్లో నీళ్లు వస్తాయని వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. “శ్రీశైలం ప్రాజెక్ట్‌ గేట్లు పూర్తిగా ఎత్తిన పరిస్థితి చూస్తున్నాం.. మంచి పరిపాలనకు దేవుడు తోడుంటాడు.. సీఎం జగన్ పాలనలో వరుసగా మూడో ఏడాదిలో కూడా ప్రాజెక్ట్‌లు నీటితో నిండాయి.” అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

ప్రాజెక్ట్‌లలో నీళ్లు పుష్కలంగా ఉంటే చంద్రబాబు కంట్లో నీళ్లు వస్తాయని శ్రీకాంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతులు సంతోషంగా ఉండకూడదనే దుర్బుద్ధి చంద్రబాబుది అని ఆరోపించిన శ్రీకాంత్ రెడ్డి.. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్ సలహాదారుగా చంద్రబాబు ఉన్నాడని ఎద్దేవా చేశారు.

తమది రైతు పక్షపాత ప్రభుత్వమని చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వ్యవసాయం దండగ అనిన వ్యక్తి చంద్రబాబు.. ఆయన 14 ఏళ్ల పాలనలో 12 ఏళ్లు కరువేనని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు.

రైతులు ఆనందంగా ఉంటే.. చంద్రబాబుకు కడుపు మంట అని శ్రీకాంత్ రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణ ప్రాజెక్ట్‌లను చంద్రబాబు సమర్థిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. కేటాయించిన నీటిని మాత్రమే తాము వాడుకుంటున్నామన్నారు. తెలంగాణ మాత్రం అక్రమంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోందని శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Read also :  Pawan Kalyan – Raghavendra Rao: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకి జనసేనాని పవన్ కళ్యాణ్ లేఖ