అక్టోబరు 4న వాహనమిత్ర పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ‘వైఎస్ఆర్ వాహనమిత్ర’ ద్వారా ఏడాదికి రూ.10 వేల సాయం అందించనున్నారు. సొంతంగా ఆటో, క్యాబ్, టాక్సీలు నడుపుకుంటున్న వాళ్లకి ఈ పథకం వర్తించనుంది. దరఖాస్తుల స్వీకరణకు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆఫ్లైన్, ఆన్లైన్ తో నేరుగా దరఖాస్తులు స్వీకరించనున్నారు. నేటి వరకు 94 వేల దరఖాస్తుల పరిశీలనను అధికారులు పూర్తి చేశారు. ఈ నెల 30 వరకు దరఖాస్తులను పరిశీలించనున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సమర్పించాల్సిన పత్రాలు:
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులు తమ, తమ కుల ధృవీకరణ సర్టిఫికేట్లు సమర్పించాల్సి ఉంటుంది.