ఏపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా జెరూసలేం పర్యటనకు వెళుతున్నారు. ఈ రోజు సాయంత్రం జెరూసలేం చేరుకోనున్న ఆయన.. ఆగష్టు 5న తిరిగి అమరావతికి రానున్నారు. తర్వాత ఆగస్టు 15 నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. 17న డాలస్‌లో ప్రవాసాంధ్రల నుద్దేశించి ప్రసంగించనున్నారు. జగన్ అమెరికా వెళ్లేందుకు సీబీఐ కూడా అనుమతించింది. ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి జగన్ అమెరికా ఫ్లైట్ ఎక్కనున్నారు. ఇందుకోసం అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. సీఎం విదేశీ పర్యటనలో ఆయన వెంట ఎస్‌ఎస్జి ఎస్పీ సెంథిల్‌కుమార్, వ్యక్తిగత భద్రతాధికారి జోషి కూడా వెళ్లనున్నారు. ఈ పర్యటన కోసం ప్రభుత్వం 22. 52 లక్షలు విడుదల చేసింది.
వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా గతంలో జెరూసలేం వెళ్లారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జెరూసలేంలో పర్యటించారు. ఇప్పుడు జగన్ కూడా సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇక్కడకు వెళ్తున్నారు. అంతేకాదు.. రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించే దిశగా ఈ పర్యటన కొనసాగనున్నట్టు తెలుస్తోంది.