ఏపీ అసెంబ్లీలో తొమ్మిది మంది టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ లిస్ట్‌లో నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, వెలగపూడి రామకృష్ణ బాబు, బెందాళం అశోక్, మద్దాల గిరిధర్ రావు, బాల వీరాంజనేయ స్వామి, అనగాని సత్య ప్రసాద్, వై సాంబశివరావు, జి రామ్మోహన్ రావు ఉన్నారు. సభ జరగకుండా అడ్డుకుంటున్నారని, సభా కార్యక్రమాలకు విఘాతం కల్పిస్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం వీరిని సస్పెండ్ చేశారు. ఇక దీనిపై స్పీకర్ మాట్లాడుతూ.. సభ్యుల సస్పెన్షన్ సభలో ఎవరికీ ఇష్టం లేదని, సభ్యుల సస్పెన్షన్‌పై మనస్తాపానికి గురయ్యానని, కానీ తప్పని పరిస్థితుల్లో సస్పెండ్ చేయాల్సి వచ్చిందని అన్నారు. కాగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్న విషయం తెలిసిందే.