ఏపీ టీడీపీకి కొత్త అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు..

ఏపీ టీడీపీకి కొత్త బాస్ వచ్చేశారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును నియమించనున్నారు

ఏపీ టీడీపీకి కొత్త అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు..

Updated on: Sep 22, 2020 | 1:39 PM

ఏపీ టీడీపీకి కొత్త బాస్ వచ్చేశారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును నియమించనున్నారు. ఈ నెల 27న అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇప్పటిదాకా ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు ఉండగా.. ఆయన స్థానంలో మళ్లీ బీసీ వర్గానికే పట్టం కట్టనున్నారు. (TDP State President Achannaidu Kinjarapu)

అలాగే అదే రోజున నూతన కమిటీ సభ్యుల జాబితాను ప్రకటించనున్న చంద్రబాబు.. జిల్లాల కమిటీల స్థానంలో పార్లమెంట్ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. కాగా, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు 25 అధ్యక్షులను నియమించనున్నట్లు సమాచారం.

Also Read:

మందుబాబులకు మరో గుడ్ న్యూస్.. ఏపీలో బార్లకు గ్రీన్ సిగ్నల్..

శభాష్ సాయి తేజ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సుప్రీమ్ హీరో..