TDP: డీజీపీకి వ్యతిరేకంగా నినాదాలు.. పోలీసు విధులకు ఆటంకం.. టీడీపీ నేతలపై కేసు

|

Sep 20, 2021 | 7:01 AM

డీజీపీ ఆఫీసుకి వెళ్లిన టీడీపీ నాయకులపై కేసులు నమోదయ్యాయి. అమరావతిలో ఏఎస్సై మధుసూదనరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు

TDP: డీజీపీకి వ్యతిరేకంగా నినాదాలు.. పోలీసు విధులకు ఆటంకం.. టీడీపీ నేతలపై కేసు
Ap Dgp Office
Follow us on

AP – TDP – Police Cases: డీజీపీ ఆఫీసుకి వెళ్లిన టీడీపీ నాయకులపై కేసులు నమోదయ్యాయి. అమరావతిలో ఏఎస్సై మధుసూదనరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు పోలీసులు. 17 మంది టీడీపీ నేతలతో పాటు మరికొందరిపైనా కేసులు పెట్టారు. 143, 341, 188 269 270 రెడ్విత్ 149 ఐపీసీల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.

ప్రభుత్వానికి, డీజీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ అభియోగాలు మోపారు. అంతేకాదు, అనుమతి లేకుండా డీజీపీ ఆఫీస్ లోకి చొచ్చుకు వచ్చారని టీడీపీ నేతలపై పోలీసులు పెట్టిన ఫిర్యాదులో పేర్కొన్నారు ఏఎస్పై మధుసూదనరావు.

ఇదిలాఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల ఫలితాల వేళ అనేక జిల్లాల్లో టీడీపీ – వైసీపీ నేతలు, కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. చిత్తూరు జిల్లా పరిషత్ ఫలితాలు వచ్చిన నేపధ్యంలో కుప్పంలో వైసీపీ నేతలు హీరో నారా రోహిత్ ఇంటి ముందు టాపాసులు కాల్చడంతో ఇద్దరు చిన్నారులకు గాయలయ్యాయి.

వైసీపీ నేతల తీరుపై టీడీపీ నేతలు హైవేపై ధర్నాకు దిగడంతో పోలీసులు సర్ది చెప్పారు. ఇక ఫలితాల విషయానికొస్తే, ఏపీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని పార్టీగా అవతరించింది. జిల్లాలవారీగా చూస్తే ప్రకాశం, విజయనగరం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో క్లీన్‌ స్వీప్‌ చేసి విజయఢంకా మోగించింది.

ఇక, పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి కావడంతో పరోక్ష పద్ధతిలో జరిగే మండల పరిషత్‌ అధ్యక్ష(ఎంపీపీ), జిల్లా పరిషత్‌ (జెడ్పీ) చైర్మన్‌ పదవులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదివారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 24న ఎంపీపీ, 25న జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎస్‌ఈసీ నీలం సాహ్ని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఎంపీపీ ఎన్నిక జరిగే రోజే మండల కో ఆప్టెడ్‌ సభ్యుడు, మండల ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయి.

Read also: Balineni – Peddireddy: వైసిపి విజయం ముందే ఊహించాం: మంత్రులు బాలినేని, పెద్దిరెడ్డి