Amaravathi: అమరావతి రైతులు ఎగిరి గంతేసే వార్త.. వారందరికీ నేడు జాక్‌పాట్ ఛాన్స్.. ప్రభుత్వం నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్

అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం ఊరటనిచ్చే వార్త తెలిపింది. భూములిచ్చిన రైతులకు శుక్రవారం ప్లాట్లను కేటాయించనుంది. ఇటీవల భూములిచ్చిన రైతుల బ్యాంకు రుణాలను రూ.1.50 లక్షల్లోపు మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా.. ఇప్పుడు మరో శుభవార్త అందించింది. నేడు ప్లాట్ల కేటాయింపు జరగనుంది.

Amaravathi: అమరావతి రైతులు ఎగిరి గంతేసే వార్త.. వారందరికీ నేడు జాక్‌పాట్ ఛాన్స్.. ప్రభుత్వం నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్
Amaravathi Farmers

Updated on: Jan 23, 2026 | 7:16 AM

అమరావతి రైతలుకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు తీపికబురు అందించింది. రాజధాని అభివృద్ది కోసం భూములు త్యాగం చేసిన రైతులు ప్లాట్ల కేటాయింపు కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడు ప్లాట్లు కేటాయిస్తుందా అని వెయిట్ చూస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు వారి నిరీక్షణకు తెరపడింది.  అమరావతి కోసం భూములు వదులుకున్న రైతులకు ప్రభుత్వంశుక్రవారం ప్లాట్లు కేటాయించనుంది. భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం దశలవారీగా వీటిని అందిస్తోంది. ఇప్పుడు పలు గ్రామాల్లోని రైతులకు ఈ-లాటరీ పద్దతి ద్వారా కేటాయించేందుకు సిద్దమైంది. అలాగే సీడ్ యాక్సెస్‌తో పాటు ఇతర అభివృద్ది పనుల కోసం భూములిచ్చిన రైతులకు కూడా ప్లాట్ల కేటాయింపు చేయనుంది.

ఈ రైతులకు కేటాయింపు

2019కి ముందు రాజధాని కోసం భూములిచ్చిన రైతుల్లో కొంతమందికి వివిధ కారణాల వల్ల ప్లాట్ల కేటాయింపు జరగలేదు. వీరితో పాటు 2024 జూన్‌లో భూములిచ్చిన రైతులకు కూడా శుక్రవారం కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉండవల్లిలో 201 మంది రైతులకు 390, 14 గ్రామాల్లో 90 మంది రైతులకు 135 ప్లాట్ల కేటాయింపు ఇవాళ జరగనుందని సీఆర్‌డీఏ అధికారులు స్పష్టం చేశారు. 14 గ్రామాల్లోని రైతులకు ఉదయం 11 గంటలకు లాటరీ పద్దతిలో కేటాయించనుండగా.. మధ్యాహ్నం 3 గంటలకు ఉండవల్లి రైతులకు కేటాయింపు జరగనుంది. రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుందని అధికారులు తెలిపారు. అటు ఈ నెల 27న సీడ్ యాక్సెస్ కోసం రోడ్డు ఇచ్చిన రైతులకు, ఈ నెల 30న ఉండవల్లిలో జరీబు కోసం భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు జరుగుతుందని సీఆర్డీఏ అధికారులు ప్రకటించారు.

ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారంటే..?

ఇప్పటివరకు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల్లో 29,233 మందికి 69,421 ప్లాట్లు కేటాయించారు. 2019కి ముందు 27,323 మంది రైతులకు కేటాయించగా.. 2024లో అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం 1366 మంది రైతులకు 6,703 ప్లాట్లు కేటాయించింది. ఇక రాజధాని కోసం రెండో దశ భూసేకరణ ప్రక్రియను కూడా ప్రభుత్వం ఇటీవల చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చాలామంది భూములిచ్చేందుకు ముందుకొస్తున్నారు. దీంతో వీరికి కూడా త్వరలో ప్లాట్లు కేటాయించనుంది. రైతులు తమ పొలాలకు దగ్గర్లోనే ప్లాట్లను కేటాయిస్తున్నారు. ఎన్ని ప్లాట్లు కావాలో ఎంత విస్తీరణంలో కావాలని అనేది సీఆర్డీఏ అధికారులు రైతులు ముందుగా తెలియజేయాల్సి ఉంటుంది. దానికి తగ్గట్లు సీఆర్డీఏ రైతులకు ప్లాట్లు కేటాయించే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తోంది.  ఇటీవల రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు రూ.1.50 లక్షల్లోపు రుణమాఫీ చేస్తున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. ఈ క్రమంలో ప్లాట్ల కేటాయింపు జరుగుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.