
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న జగన్.. ఇవాళ పీఎంతో సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రాత్రి జన్‌పథ్-1లోని నివాసంలో బస చేసిన సీఎం.. ఉదయం 10:30 గంటలకు ప్రధానితో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు నిధుల సాధనే ప్రధాన లక్ష్యంగా భేటీలో చర్చకు రానుంది. అలాగే, నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని కోరనున్నారు సీఎం జగన్. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను అమలు చేయాలని సీఎం కోరనున్నారు. ఆ తర్వాత వీలును బట్టి కేంద్ర మంత్రులను కూడా కలువనున్నారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌లను కూడా సీఎం వైఎస్ జగన్ కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..