Litigation policy: లిటిగేషన్ పాలసీని నిరంతరం పర్యవేక్షించే మెకానిజంపై న్యాయాధికారులు, కార్యదర్శులతో కీలక సమీక్ష

|

Jul 31, 2021 | 9:49 PM

అమరావతి వెలగపూడిలోని సచివాలయంలో లిటిగేషన్ అంశాలపై సిఎస్(చీఫ్ సెక్రటరీ) ఆదిత్యా నాధ్ దాస్ అధ్యక్షతన న్యాయాధికారులు, వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం జరిగింది...

Litigation policy: లిటిగేషన్ పాలసీని నిరంతరం పర్యవేక్షించే మెకానిజంపై న్యాయాధికారులు, కార్యదర్శులతో కీలక సమీక్ష
Cs Adityanath Das
Follow us on

CS Review on litigation policy: అమరావతి వెలగపూడిలోని సచివాలయంలో లిటిగేషన్ అంశాలపై సిఎస్(చీఫ్ సెక్రటరీ) ఆదిత్యా నాధ్ దాస్ అధ్యక్షతన న్యాయాధికారులు, వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం జరిగింది. ఈ పాలసీనీ 2013లో ఆమోదించారు. నిరంతరం లిటిగేషన్ పాలసీలను పర్యవేక్షించేందుకు అవసరమైన మెకానిజంపై అధికారులకు సూచనలిచ్చారు సీఎస్. లిటిగేషన్ సంబంధిత ప్రభుత్వ శాఖలు.. ఆయా శాఖలకు సంబంధించిన విధి విధానాలు, నిబంధనల జాబితాను తయారు చేశారు. ప్రభుత్వ న్యాయవాదులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వపాలసీలపై వచ్చే వ్యాజ్యాలపై నిరంతరం పర్యవేక్షించే ఓ మెకానిజం ఏర్పాటు చేయనున్నారు అధికారులు.

ఇప్పుడున్న వ్యాజ్యాలు అడ్మిషన్ స్థాయిలోనే కంటెస్ట్ చేసేలా.. ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన చర్యలపై, అధికారులు ఎప్పటికప్పుడూ మార్పులు చేసుకోవాలన్నారు సీఎస్ ఆదిత్యానాథ్ దాస్. ఈ లిటిగేషన్ సెక్షన్‌లో ఇప్పడున్నా పరిస్థితుల అనుగుణంగా మార్పులకు అనుమతులు ఇచ్చారు అన్ని శాఖలకు. మరోవైపు పలు రకాలుగా ఉండే వ్యాజ్యాలపై పీరియాడికల్ .. ఫెల్యూర్ పై జవాబుదారీతనాన్ని ఫిక్స్ చేయడంపైన కూడా చర్చించారు. ఆన్లైన్ కేసు లోడ్ మేనేజిమెంట్ సిస్టమ్ అమలు విధానం పైన చర్చ జరిగింది.

అడ్వకేట్ జనరల్, గవర్నమెంట్ ప్లీడర్లలో కార్యాలయాలను మరింత బలోపేతం చేయడం తోపాటు.. ఆ కార్యాలయాల్లో ఆన్ లైన్ కేసు లోడ్ మేనేజిమెంట్ సిస్టమ్ ను ప్రవేశ పెట్టేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ కోరారు. ప్రతి ప్రభుత్వ శాఖలోను లైజన్ అధికారులు, లీగల్ ఆడ్వయిజర్లను నియమించుకోవాలన్నారు. కోర్టు కేసుల నిర్వహణ పై మార్గదర్శకాలు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందికి న్యాయ సంబంధిత అంశాలపై కెపాసిటీ బిల్డింగ్ చేయడం వంటి పలు అంశాలపైనా కూడా సమావేశంలో అధికారులతో చర్చించారు సీఎస్ ఆదిత్యానాథ్.

Read also: Ganapati idols: అత్యద్భుతం.. రైతు పొలం దున్నుతుండగా బయలప్పడ్డ మూషిక వాహనుడైన పురాతన గణపతి విగ్రహం, రాతి పీఠం