గురువారం ఏపీ నూతన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పాలనపై దృష్టి సారించారు. ఈ క్రమంలో జూన్ 8న ఏపీ కేబినెట్‌ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మొదటిసారిగా 15మందికి జగన్ తన కేబినెట్‌లో స్థానం కల్పించనున్నట్లు సమాచారం. అలాగే జూన్ 11 తరువాత మూడు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఏపీ సీఎంవో కార్యాలయంలో వైఎస్ జగన్ కొత్త టీమ్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డీజీపీగా గౌతమ్ సవాంగ్‌ను నియమించుకున్నారు జగన్. రేపటిలోగా వివిధ శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు స్థానచలనం ఉండే అవకాశం ఉండనున్నట్లు సమాచారం.