Andhra Pradesh Crime News: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చేనేత కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. దంపతులతోపాటు వారి కుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన (krishna district) జిల్లాలోని పెడనలో చోటుచేసుకుంది. మృతులు కాచన పద్మనాభం (52), నాగ లీలావతి (45), రాజా నాగేంద్ర (24) గా పోలీసులు గుర్తించారు. కుటుంబం ఆత్మహత్య (family suicide) గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు స్థానికుల నుంచి పలు వివరాలు సేకరిస్తున్నారు. వీరంతా అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అప్పుల బాధతోనేనా, లేక మరేదైనా కారణం ఉందా.. అనే అంశాలపై పలుకోణాల్లో కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్య చేసుకుని మరణించడంతో గ్రామంలో విషాదం నెలకొంది. పద్మనాభం కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Also Read: