Amaravati: అమరావతి సచివాలయం వద్ద ఉన్న రైతును కల తప్పినా పట్టించుకోరే…

అమరావతి సచివాలయం ప్రాంగణంలోని ఎద్దుల బండి చిహ్నం రైతుల గౌరవాన్ని ప్రతిబింబించే ఒక ప్రత్యేక గుర్తుగా నిలిచింది. 2015లో సీఎం చంద్రబాబు ప్రారంభించిన సచివాలయంలో ఈ ఎద్దుల బండి, రైతుల సంపద, శ్రమను ప్రదర్శించే సాంస్కృతిక చిహ్నంగా ఆకర్షణీయంగా నిలిచింది. అయితే వర్షం, ఎండలతో అది ఇప్పుడు కల తప్పింది.

Amaravati: అమరావతి సచివాలయం వద్ద ఉన్న రైతును కల తప్పినా పట్టించుకోరే...
Amaravati Secretariat Ox Cart

Edited By:

Updated on: Nov 19, 2025 | 6:03 PM

అమరావతి సచివాలయం ప్రాంగణంలో రైతుల గౌరవాన్ని ప్రతిబింబించే ఎద్దుల బండి దృశ్యం ప్రతి సందర్శకుడిని ఆకర్షించేది.. ఇదేదో కేవలం ఒక భవనం గోడపై ఉన్న మున్నీచి పెయింట్ కాదు.. ఇది సర్కార్ అభివృద్ధికి , రైతుల గౌరవానికి  ప్రతీకగా నిలిచిన ఒక చిహ్నం.. కానీ అదృష్టం కాస్తా.. దురదృష్టంగా మారినట్లుగా ఇక్కడి ఎద్దుల బండి చిహ్నం గత పూర్వ వైభవాన్ని మరిచిపోయింది..

రైతుల చిహ్నం.. ఎద్దుల బండి. వివిధ పనుల కోసం అమరావతి సచివాలయానికి వచ్చే సందర్శకులకు ఒక ప్రత్యేక ఆకర్షణగా అక్కడ ఉన్న ఎడ్ల బండి ఉండేది. ముఖ్యంగా ఈ చిహ్నం ఆ ప్రాంతాన్ని సందర్శించే ప్రతి ఒక్కరికి ఒక గుర్తుగా నిలుస్తుంది.. ఇది 2015లో సీఎం చంద్రబాబు ప్రారంభించిన సచివాలయం ప్రాంగణంలో ఒక ప్రత్యేకమైన గుర్తుగా నిలిచింది.

అక్కడి ఎద్దుల బండిని 2014 – 15 సమయంలో సచివాలయంలో దూరం నుంచి చూస్తే రైతు.. ఈ ఎద్దుల బండిపై ధాన్యం బస్తాలను తీసుకువెళ్తున్నట్లుగా కనిపిస్తుంది.. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ రైతు చిహ్నం చాలా ఏళ్లుగా ఎటువంటి ఆధునీకరణ , పెయింటింగ్ లేకుండా నిరాధరణకు గురైంది.

సీఎం చంద్రబాబు సచివాలయం ప్రారంభం సమయంలో ఎద్దుల బండి చిహ్నాన్ని చాలా శ్రద్ధతో రూపొందించారు.. ఈ చిహ్నం రైతు సమాజానికి గౌరవాన్ని చేకూర్చేలా వాస్తవికతకు దగ్గరగా ఉండేలా డిజైన్ చేశారు.. ఎద్దుల బండిపై రంగులు , బస్తాలు , రైతు బొమ్మలు ఈ ప్రాంతాన్ని సందర్శించే ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేవి.. ప్రతిరోజు సచివాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే వచ్చే ప్రజలు, ఉద్యోగులు ఇతర సందర్శకులు ఈ చిహ్నం వద్ద ఫోటోలు దిగేందుకు పోటీ పడతారు.

అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ చిహ్నాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.. ఎండ , వర్షం కారణంగా పెయింట్ పెచ్చులు ఊడిపోతుంది.. అది చిహ్నం కలను కోల్పోయేలా తయారవుతుంది. ప్రస్తుతం ఎద్దుల బండి చిహ్నం నిర్లక్ష్యానికి గురికావడం అందరిని బాధను కలిగిస్తోంది. దాన్ని చూసిన సందర్శకులు.. దానిని ఆధునికరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.