East Godavari: ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. రాష్ట్రవ్యాప్తంగా కనుమ రోజు కూడా కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కనుమ రోజు జిల్లాలో కోడిపందాలు, గుండాటలు జోరుగా సాగుతున్నాయి. పోలీసుల ముందు కోడిపందాల రాయుళ్లె గెలిచినట్లు అయింది. ఒక పక్క జూదాలు మరో పక్క కోడి పందాలు నడుస్తుంటే.. పందెంలో డీలాపడ్డ కోడిని (కోస) అధిక ధరకు విక్రయిస్తున్నారు. కొన్ని నెలల పాటు పుష్టిగా పెంచిన కోడిపుంజు.. పందెంలో ఓడిపోవడంతో కోస పేరుతో దానిని విక్రయిస్తుంటాయి. ఈ కోడిపుంజును దాదాపు 2000 నుండి 5000 వరకు డిమాండ్ ఉంది. పందెం అవ్వగానే స్పాట్‌లో కోస కోసం ఎగబడుతున్నారు మాంసం ప్రియులు.. కోనసీమలో కోసకు ఉన్న డిమాండ్ మరి దేనికి లేదంటున్నారు ప్రజలు.. ఈ కోస మాంసాన్ని రాష్ట్రాలు సైతం తరలిస్తున్నారని పేర్కొంటున్నారు.
ఓ పక్క పందాలు జరుగుతున్న సమయంలోనే కోస… కోసం మాంసం ప్రియులు వేచి ఉంటున్నారు. పందెం ముగిసిన వెంటనే కోస కావాలంటూ పెందెం గెలిచిన వారి చుట్టూ చేరుతున్నారు. దీంతో పందెం రాయుళ్లు అక్కడ ఉన్న డిమాండ్‌ను బట్టి.. రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు విక్రయిస్తున్నారు. అయితే.. పక్క రాష్ట్రాల నుంచి సంక్రాంతి సంబరాలకు ఈ ప్రాంతానికి వచ్చిన వారు.. కోస (కోడిపుంజు) ను కొనుగోలు చేసుకొని.. వారి సొంత ఊర్లకు పట్టుకెళుతున్నారు. డిమాండ్ ఉన్నా.. కోస కావాలంటూ పందెం రాయుళ్ల చుట్టూ చేరుతున్నారు.
Also Read: