AP Government: ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపుపై విద్యాశాఖ మంత్రి ఏమన్నారంటే.!

|

Jan 16, 2022 | 6:01 PM

ఆంధ్రప్రదేశ్‌లో విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. విద్యాసంస్థలకు సెలవులను పొడిగించే...

AP Government: ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపుపై విద్యాశాఖ మంత్రి ఏమన్నారంటే.!
Adimulapu Suresh
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. విద్యాసంస్థలకు సెలవులను పొడిగించే అవకాశం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. దీనితో రేపట్నుంచి ఏపీలో యధావిధిగా స్కూల్స్, కాలేజీలు తెరుచుకోనున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా కాకుమానులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విద్యాసంస్థలకు సెలవుల పొడిగింపు విషయంలో పైవిధంగా కామెంట్స్ చేశారు.

Also Read: రైలు పట్టాలపై కుప్పలుగా అమెజాన్ డెలివరీ ప్యాకెట్లు.. ఎందుకో తెలిస్తే షాక్.!

ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్య భద్రత తో పాటు భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తుందని ఆయన చెప్పారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేశామని, 15 నుంచి 18 సంవత్సరాల వయసు విద్యార్థులకు కూడా దాదాపు 92 శాతం వ్యాక్సిన్ వేయడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పాఠశాలలను యధావిధిగా నడపాలని ఆలోచిస్తూనే వారి ఆరోగ్య భద్రత పై కూడా డేగ కన్నుతో నిఘా ఉంచడం జరిగిందన్నారు. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ పాఠశాలలను నడిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. ఇప్పటికైతే పాఠశాలలకు సెలవులు ప్రకటించే ఆలోచన లేదని భవిష్యత్తులో కేసుల తీవ్రతను బట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు ఆలోచిస్తామని ఆయన చెప్పారు.

కాగా, తెలంగాణలో కోవిడ్ కేసులు పెరుగుతుండటం విద్యాసంస్థలకు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటివరకు విద్యార్ధులకు ఆన్‌లైన్ ద్వారా పాఠాలు బోధించేందుకు విద్యాశాఖ షెడ్యూల్ సిద్దం చేస్తోంది.

Also Read: ఖతర్నాక్ దొంగ.. స్కెచ్ మాములుగా లేదుగా.. ఫోన్ ఎలా కొట్టేశాడో చూస్తే ఫ్యూజులు ఔట్!