Andhra Pradesh: చంద్రగిరిలో రచ్చరాజేస్తున్న మత్తు పదార్థాల విక్రయాల ఆరోపణలు.. పోలీసులు వెర్షన్ ఏంటంటే..

|

Dec 01, 2022 | 5:00 AM

తిరుపతి జిల్లా చంద్రగిరిలో టీ దుకాణం పేరిట సిగరట్లలో గంజాయి మిక్స్ చేసి.. పాఠశాల విద్యార్థులకు అలవాటుచేస్తున్నారన్న ఆరోపణలు రచ్చ రాజేస్తున్నాయి. ఛాయ్‌ పే గంజాయి రచ్చ. బడిబాటలో మత్తుదందాపై చంద్రగిరి..

Andhra Pradesh: చంద్రగిరిలో రచ్చరాజేస్తున్న మత్తు పదార్థాల విక్రయాల ఆరోపణలు.. పోలీసులు వెర్షన్ ఏంటంటే..
Smoking (file Photo)
Follow us on

తిరుపతి జిల్లా చంద్రగిరిలో టీ దుకాణం పేరిట సిగరట్లలో గంజాయి మిక్స్ చేసి.. పాఠశాల విద్యార్థులకు అలవాటుచేస్తున్నారన్న ఆరోపణలు రచ్చ రాజేస్తున్నాయి. ఛాయ్‌ పే గంజాయి రచ్చ. బడిబాటలో మత్తుదందాపై చంద్రగిరి భగ్గుమంది. ఈ విషయం కేసుల వరకు వెళ్లింది. బాలికల ఉన్నత పాఠశాల ఎదురుగా వున్న దుకాణంలో అమ్మాయిలతో సిగరెట్టు తాగిస్తుందెవరు, వాటిలో గంజాయిని మిక్స్‌ చేస్తుంది నిజమేనా.. ఈ వ్యవహారం ఎన్నాళ్లుగా సాగుతోంది. ఏ ధైర్యంతో ఈ బరితెగింపు.. దీని వెనుక ఉన్నది ఎవరూ.. అమ్మాయిలకు గంజాయి సిగరెట్లు సప్లయ్‌ చేస్తుంది నిజమేనా ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తుంటే.. పోలీసులు మాత్రం పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతోందంటున్నారు. అబ్బాయిలై ఉండి అమ్మాయిల ఫేస్‌క్రీము వాడితే పోయేదేమీ లేదు..కానీ ఇలా మత్తుకు బానిసైతే మాత్రం జీవితం నాశనం అవడం పక్కా. అమ్మాయిలకు గంజాయి సిగరెట్లను అలవాటు చేస్తున్నారనే ఆరోపణలు.. ఆందోళనలతో చంద్రగిరి దద్దరిల్లింది. గాళ్స్‌ హైస్కూల్‌ ఎదురుగా వున్న పాన్‌షాప్‌, టీ కొట్టు అడ్డాగా ఈ దందా చేస్తున్నాదెవరు. ఈ బరి తెగింపు వెనుక ఎవరి అండదండలు ఉన్నాయనే చర్చ సాగుతోంది. స్కూల్‌ నుంచి వచ్చిన కూతురు.. మళ్లీ బయటకు వెళ్లడం.. ఎంతకు తిరిగి రాకపోవడంతో పేరెంట్స్‌ కంగారుపడ్డారు. ఎక్కడకు వెళ్లిందని వెదికితే.. సిగరెట్‌ వ్యవహారం తెరపైకి వచ్చింది. అంతే అక్కడ జరుగుతున్న తంతు చూసి తల్లిదండ్రులు నివ్వెరపోయారు.

గంజాయి సిగరెట్లు విక్రయిస్తోన్న షాప్‌ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధిత స్టూడెంట్‌ పేరెంట్స్‌. మరి స్కూల్‌ ఎదుట ఇంత తతంగం జరుగుతుంటే టీచర్లు ఏం చేస్తున్నారు.. ఏం చూస్తున్నారని ప్రశ్నించారు పేరెంట్స్‌, స్థానికులు. స్కూల్‌ ఎదుట ఆందోళనకు దిగారు.స్కూల్‌కు ఎదురుగా వున్న టీ స్టాల్‌ అడ్డాగా అమ్మాయిలను గంజాయి ఊబిలోకి దింపుతున్న వైనం చంద్రగిరిలో సంచలనం రేపింది. ఓవైపు ఇంత గొడవ జరిగినా.. పబ్లిక్‌ నిలదీసిన హెడ్మాస్టర్‌, టీచర్లు మాత్రం నోరు మెదపడంలేదు.

పాఠశాల ముందు మత్తు దందా.. అమ్మాయిలకు గంజాయి సిగరెట్లు…. ఈ వ్యవహారం ఎన్నాళ్లుగా సాగుతోంది. స్కూళ్లను టార్గెట్‌ చేసి మత్తు చల్లడం వెనుక మర్మమేంటి.. ఆందోళనల సెగలతో గంజాయి గుట్టు బయటపడుతోంది. ఐతే ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. మరి ఈ ఎపిసోడ్‌ పోలీసుల వెర్షన్‌ చూస్తే వైడ్‌ యాంగిల్‌లో ఎంక్వయిరీ చేపట్టామన్నారు డీఎస్పీ నరసప్ప. గుట్టుగా సాగుతోన్న గంజాయి దందా వ్యవహారం.. ఆందోళనల పర్వంతో గుప్పు మంది. దొరికితే దొంగ.. దొరక్కుండా ఎన్నాళ్ల నుంచి ఈ దందా సాగుతోంది. ఎంత మంది స్టూడెంట్స్‌ను గంజాయి ఊబిలోకి దింపారు. మొత్తానికి గుట్టు బయటపడింది. మరి పాఠశాల సమీపంలో విద్యార్థులే టార్గెట్‌గా మత్తు బద్మాష్‌గిరి చేస్తున్నదెవరు.. వాళ్లను నడిపిస్తున్నదెవరు.. దర్యాప్తులో లెక్క తేలుతుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..