Andhra Pradesh: రమ్య హత్య కేసులో మరో మలుపు.. హైకోర్టును ఆశ్రయించిన నిందితుడు

|

May 13, 2022 | 7:09 AM

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో సంచలనం రేకెత్తించిన ఇంజినీరింగ్ విద్యార్థిని రమ్య హత్య కేసులో మరో కీలక పరిమాణం చోటు చేసుకుంది. నిందితుడికి ఉరిశిక్షే సరైనదని భావిస్తూ గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం తీర్పు....

Andhra Pradesh: రమ్య హత్య కేసులో మరో మలుపు.. హైకోర్టును ఆశ్రయించిన నిందితుడు
High Court
Follow us on

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో సంచలనం రేకెత్తించిన ఇంజినీరింగ్ విద్యార్థిని రమ్య హత్య కేసులో మరో కీలక పరిమాణం చోటు చేసుకుంది. నిందితుడికి ఉరిశిక్షే సరైనదని భావిస్తూ గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. శశికృష్ణ హైకోర్టును(High Court) ఆశ్రయించాడు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తదుపరి విచారణ ఈనెల 19 కి వాయిదా వేసింది. గతేడాది ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల రోజు గుంటూరు నగరంలో పట్టపగలు నడిరోడ్డుపై రమ్యను ప్రేమోన్మాది కిరాతకంగా హతమార్చాడు. ఈ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఇంజినీరింగ్‌ చదువుతున్న రమ్యకు వట్టిచెరుకూరు మండలం ముట్లూరుకు చెందిన కుంచాల శశికృష్ణ సోషల్‌ మీడియా(Social Media) ద్వారా పరిచయమయ్యాడు. కూలి పనులకు వెళ్లే ఆ యువకుడితో కొద్దిరోజుల పాటు స్నేహంగా మాట్లాడిన రమ్య అతను ప్రేమిస్తున్నట్లు చెప్పడంతో నిరాకరించింది. అప్పటి నుంచి ఆమెపై కక్ష పెంచుకున్నాడు. గతేడాది ఆగస్టు 14న స్నేహితుడితో కలిసి కళాశాలకు వెళ్లి రమ్యతో మాట్లాడటానికి ప్రయత్నించగా ఆమె మాట్లాడలేదు. మరింత కోపం పెంచుకున్న శశికృష్ణ మరుసటి రోజు ఆమె ఇంటి సమీపంలో మాటు వేశాడు.

ఉదయం 9.40 గంటలకు రమ్య అల్పాహారం కోసం బయటకు రాగా హోటల్‌ వద్ద మరోసారి ఘర్షణ జరిగింది. తన వద్ద ఉన్న కత్తితో దారుణంగా పొడిచాడు. స్థానికులు వెంటనే అప్రమత్తమై బాధితురాలిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. పాత గుంటూరు పోలీసులు అదేరోజు సాయంత్రం నిందితుడిని అరెస్టు చేశారు. గతేడాది డిసెంబరు 7న విచారణ ప్రారంభమైన ఈ కేసులో 9 నెలల్లోపే నిందితుడికి శిక్ష పడింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీచదవండి

Health Tips: కడుపులో గ్యాస్‌, ఉబ్బరంతో ఇబ్బంది పడుతున్నారా.. కిచెన్‌లో ఉండే ఈ పదార్థాలతో చక్కటి ఉపశమనం..!

K.A. Paul: కేంద్ర హోం మంత్రిని కలిసిన కేఏ పాల్.. జడ్ ప్లస్ సెక్యూరిటీ కేటాయించాలని వినతి..