Jogu Ramesh: మాజీ మంత్రి జోగి రమేశ్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం

|

Aug 13, 2024 | 9:49 AM

మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్‌ నివాసంలో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. 15 మంది ఏసీబీ అధికారుల బృందం మంగళవారం(ఆగస్ట్ 13) ఉదయం ఆయన ఇంటికి చేరుకుని సోదాలు చేపట్టారు.

Jogu Ramesh: మాజీ మంత్రి జోగి రమేశ్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం
Jogu Ramesh
Follow us on

మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్‌ నివాసంలో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. 15 మంది ఏసీబీ అధికారుల బృందం మంగళవారం(ఆగస్ట్ 13) ఉదయం ఆయన ఇంటికి చేరుకుని సోదాలు చేపట్టారు. అగ్రి గోల్డ్‌ భూముల వ్యవహారంపై ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్నట్లు సమాచారం.

అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంలోనే జోగి రమేష్‌పై ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. భూముల రిజిస్ట్రేషన్లలో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన రికార్డులు, డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. జోగు రమేశ్ ఇంటిని పూర్తిగా కంట్రోల్‌లోకి తీసుకున్న ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి కేసుతోపాటు అగ్రిగోల్డ్ భూవివాదం విషయంలోనూ జోగి రమేష్‌పై కేసులు ఉన్నాయి. భూ వివాదంపై గత నెలలోనే DGP విచారణకు ఆదేశించారు. డీజీపీ ఆదేశాలతోనే ACB అధికారులు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. జోగి రమేష్ ఓవైపు చంద్రబాబు ఇంటిపై దాడి కేసు లో నిండుతునిగా ఉన్నారు.

అగ్రిగోల్డ్ భూముల కొనుగోళ్లలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అగ్రిగోల్డ్‌ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని జోగి రమేష్‌పై ఫిర్యాదు వచ్చాయి. ఈ కేసు నిందితుల్లో జోగి రమేష్‌ కుటుంబసభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. ఏ1, ఏ2గా ఉన్న జోగి రమేష్‌ కుటుంబసభ్యులు ఉన్నారు. జోగి రమేష్‌ కుటుంబసభ్యులతోపాటు మొత్తం 9మందిపై సీఐడీ కేసులు నమోదు చేసింది. విజయవాడ రూరల్‌ అంబాపురంలో సర్వే నెంబర్లు మార్చేసి, అగ్రిగోల్డ్‌ భూమిని రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు అధికారులు సస్పెన్షన్ వేటుకు గురయ్యారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…