Andhra Pradesh: మీసం మెలేస్తున్న ఆల్ రొయ్య.. ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

గచ్చకాయల పోర తీరంలో అరుదైన ఆల్ రొయ్యలు లభించాయి. సాధారణ రొయ్యల కంటే పెద్ద మీసాలు, ఎక్కువ కాళ్లు కలిగి, రుచికరంగా ఉండే వీటిని మాంసప్రియులు ఎంతో ఇష్టపడతారు. మార్కెట్లో వీటికి భారీ డిమాండ్ ఉండటంతో వేలల్లో ధర పలుకుతున్నాయి. స్థానిక మత్స్యకారులకు ఇవి మంచి ఆదాయాన్ని తెచ్చిపెడతాయి.

Andhra Pradesh: మీసం మెలేస్తున్న ఆల్ రొయ్య.. ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..
Aal Prawns Found On Konaseema Coast

Edited By: Krishna S

Updated on: Nov 14, 2025 | 2:09 PM

అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికొన మండలం గచ్చకాయల పొర సముద్ర తీరం ప్రస్తుతం అరుదైన ఆల్ రొయ్యల సందడితో కళకళలాడుతోంది. ఈ తీరప్రాంత మత్స్యకార గ్రామంలో అప్పుడప్పుడు మాత్రమే దొరికే ఈ ప్రత్యేకమైన రొయ్యలు తాజాగా లభించడంతో మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ రొయ్యల కంటే ఆల్ రొయ్యకు ఒక ప్రత్యేకత ఉంది. ఇవి పెద్ద పెద్ద మీసాలు కలిగి ఉంటాయి. అంతేకాకుండా సాధారణ రొయ్య కాళ్ల కంటే ఇవి ఎక్కువ కాళ్లను కలిగి ఉండటం వీటిని ప్రత్యేకంగా నిలబెడుతుంది.

ఆల్ రొయ్య రుచి అద్భుతంగా ఉంటుంద మాంసపుప్రియులు చెబుతున్నారు. వీటి డెక్క (కాళ్లు) నుండి మాంసాన్ని తీయడం అంత సులభం కాదు. రొయ్యను పూర్తిగా ఉడకబెట్టిన తర్వాతే ఈ డెక్కల నుండి గుంజును తీయడం సాధ్యమవుతుంది. మత్స్యకారుల ప్రకారం.. సముద్రంలో వేటాడే సమయంలో ఆల్ రొయ్యలు దొరకడం చాలా అరుదు. ఈ కారణంగానే మార్కెట్లో వీటికి భారీ డిమాండ్ ఉంటుంది. సాధారణ రొయ్యలు వందల్లో ధర పలుకుతుంటే.. ఈ ఆల్ రొయ్యల ధర మాత్రం వేలల్లో ఉంటుంది. మత్స్యకారులు బరువును బట్టి ఈ అరుదైన రొయ్య ధరను నిర్ణయిస్తారు.

ప్రస్తుతం గచ్చకాయల సముద్ర ప్రాంతాల్లో ఆల్ రొయ్యలు లభ్యం కావడంతో రుచికి ప్రాధాన్యత ఇచ్చే మాంసపు ప్రియులు, ఎప్పుడెప్పుడూ ఇవి దొరుకుతాయా అని ఎదురుచూసేవారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ తీరంలో ఈ అరుదైన మత్స్యసంపద దొరకడం స్థానిక మత్స్యకారులకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టనుంది.