AP News: ఏపీలోని కృష్ణా జిల్లాలో దారుణం.. ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి.. అడ్డుపడిన తల్లి, చెల్లెలిపై..

|

Jul 15, 2022 | 9:43 AM

ప్రేమించలేదని.. ఓ యువతిపై ఉన్మాది కత్తితో దాడి చేశాడు. గత కొంతకాలంగా ప్రేమ పేరుతో యువకుడు.. యువతిని వేధిస్తున్నాడు. యువతి నిరాకరించటంతో

AP News: ఏపీలోని కృష్ణా జిల్లాలో దారుణం.. ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి.. అడ్డుపడిన తల్లి, చెల్లెలిపై..
Crime News
Follow us on

Young man attacked girl: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పామర్రు మండలం మొవ్వ పెద్ద హరిజనవాడలో ప్రేమించలేదని.. ఓ యువతిపై ఉన్మాది కత్తితో దాడి చేశాడు. గత కొంతకాలంగా ప్రేమ పేరుతో యువకుడు.. యువతిని వేధిస్తున్నాడు. యువతి నిరాకరించటంతో నేరుగా ఆమె ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేశాడు. అడ్డుకున్న యువతి తల్లి, ఇద్దరు చేల్లెళ్లపై కూడా దాడి చేశాడు. పెద్ద హరిజనవాడకు చెందిన యువతిని ప్రేమిస్తున్నానంటూ.. అదే ప్రాంతానికి చెందిన నాగదేశి జాయ్ గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. తన ప్రేమను నిరాకరిస్తున్న యువతిపై.. అతను కోపం పెంచుకున్నాడు. యువతి ఇంటికి వచ్చి నాగదేశి మరోసారి ప్రేమ ప్రతిపాదన చేయగా.. ఆమె తిరస్కరించింది. దీంతో యువతిపై ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు.

అడ్డుకోబోయిన యువతి తల్లి, ఇద్దరు చెల్లెళ్లను సైతం నిందితుడు గాయపరిచాడు. గాయపడిన వారిని స్థానికులు మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని కూచిపూడి పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..