అక్రమ సంబంధాల వల్ల ఎన్నోకుటుంబాలు వీధిన పడుతున్నా కొంతమంది మారడం లేదు. సొంత భార్య భర్తలే ఒకరినొకరు చంపుకుంటున్నారు. దీంతో కడుపున పుట్టిన పిల్లలు అనాథలుగా, అభాగ్యులుగా మిగిలిపోతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ప్రియుడిపై ఉన్నమోజుతో సొంత భర్తనే హత్య చేయాలని కోరింది ఓ భార్య. అనంతరం ప్రమాదవశాత్తు చనిపోయాడని అందరిని నమ్మించాలని చూసింది. కానీ నిజం నిలకడ మీద తెలుస్తుందని ఆమెకు తెలియదు కాబోలు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ముద్దాడకు చెందిన అంబటి అసిరిపోలికి, వెంకన్నగారిపేటకు చెందిన ఓ మహిళతో ఏడేళ్ల కిందట పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. దంపతులిద్దరు నగరంలో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేసేవారు. అయితే అంపోలుకు చెందిన మరో భవన నిర్మణ కార్మికుడు షణ్ముకరావుతో ఆ మహిళ వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలిసి ఎన్నోసార్లు ఆమెను హెచ్చరించాడు. అయినా తీరు మార్చుకోని ఆ మహిళ మా ఇద్దరి ఏకాంతానికి భర్త తరచూ అడ్డుగా వస్తున్నాడని తెలిసి ప్రియుడితో కలిసి పథకం వేసింది. భర్తను ఎలాగైనా అంతమొందించాలని ప్రియుడు షణ్ముకరావుని కోరింది.
గురువారం ఎప్పటిలాగే అసిరిపోలి నగరంలోని ఓ నూతన భవన నిర్మాణ పనులకు వెళ్లాడు. అదే పనికి ప్రియుడు షణ్ముకరావు కూడా వెళ్లాడు. ఇంతలో ఆ మహిళ ప్రియుడికి ఫోన్ చేసి తన భర్తను లేపేయమని కోరింది. అనుకున్నదే తడవుగా అవకాశం కోసం ఎదురుచూసిన షణ్ముకరావు, ఒంటరిగా ఉన్నఅసిరిపోలి తలపై బండరాయితో కొట్టాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం శవాన్నిలిప్ట్ కోసం తీసిన గొయ్యిలోకి తోసేసి అక్కడి నుంచి పరారయ్యాడు. అసిరిపోలి కనిపించకపోవడంతో స్నేహితుడు రమణ అతడి కోసం వెతకడం ప్రారంభించాడు. ఫోన్ చేసినా లిప్ట్ చేయడం లేదు. దీంతో అతడి భార్యకు ఫోన్ చేయగా ఉదయం ఇంటి నుంచి పనికి వెళుతున్నానని చెప్పి వెళ్లాడని ఇంతవరకు తిరిగి రాలేదని బదులిచ్చింది. అంతేకాకుండా తన భర్త భవనం దగ్గర లిఫ్ట్‌లో ఏమైనా ఇరుక్కుపోయాడేమో అంటూ పొంతన లేని సమాధానాలు చెప్పింది. శుక్రవారం భవనం వద్ద లిప్ట్‌లో అసిరిపోలి బాడీని పోలీసులు గుర్తించారు. అయితే ఆమె మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని స్థానికులు పోలీసులకు తెలపడంతో ఆ కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. అనుకున్నట్లుగానే ఆమె ప్రియుడి కోసం తన భర్తను చంపమని కోరానని పోలీసుల వద్ద ఒప్పుకుంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు షణ్ముకరావు, ఆ మహిళను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.