Andhra Pradesh: ఛీ..ఛీ ఇదేం పైశాచికత్వం.. రెండేళ్లుగా బాలికపై స్వామీజీ అత్యాచారం

ఈ మధ్య దొంగ స్వామీజీల రాసలీలలు బయటపడటం పెరిగియింది. స్వామీజీల ముసుసులో వారు వెనక నడిపించే బాగోతాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. తాజాగా ఓ స్వామీజీ రెండెళ్ల పాటు ఓ బాలికను అత్యాచారం చేయడం కలకలం రేపుతోంది.

Andhra Pradesh: ఛీ..ఛీ ఇదేం పైశాచికత్వం.. రెండేళ్లుగా బాలికపై స్వామీజీ అత్యాచారం
Assault
Follow us
Aravind B

|

Updated on: Jun 20, 2023 | 10:09 AM

ఈ మధ్య దొంగ స్వామీజీల రాసలీలలు బయటపడటం పెరిగియింది. స్వామీజీల ముసుసులో వారు వెనక నడిపించే బాగోతాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. తాజాగా ఓ స్వామీజీ రెండెళ్ల పాటు ఓ బాలికను అత్యాచారం చేయడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే రాజమహేంద్రవరానికి ఓ బాలిక (15) చిన్నప్పుడే తన తల్లిదండ్రులను కోల్పోయింది. ఆమె బంధువులు తనని 10వ తరగతి వరకు చదివించారు. ఆ తర్వాత విశాఖపట్నంలోని కొత్త వెంకోజి పాలెం వద్ద ఉన్న జ్ఞాననంద అనే ఆశ్రమానికి పంపించారు. ఆ ఆశ్రమాన్ని పూర్ణానంద అనే స్వామీజీ నిర్వహిస్తున్నాడు. అతడు ఆ అమ్మాయికి ఆవులకు మేత వేయడం, పేడ తీయడం లాంటి పనులు చేయించేవాడు. అయితే కొద్దిరోజులకే ఆ స్వామీజీకి ఆ బాలికపై కన్ను పడింది. ఎలాగైన ఆమెను అనుభవించాలనుకున్నాడు. చివరికి అత్యాచారనికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి ప్రతిరోజూ పూర్ణానంద అతడి గదిలోకి ఆమెను అత్యాచారం చేసేవాడు.

అంతేకాదు ఆ స్వామీజీ ఆమెను అతడి గదిలోనే కాళ్లకు గోలుసులు కట్టి బంధించేవాడు. ఆమె ఎదురువస్తే కొట్టేవాడు కూడా. అలాగే ఆహారం పెట్టకుండా ఇబ్బంది పట్టేవాడు. కేవలం రెండు చెంచాలతో అన్నాన్ని మాత్రమే నీటితో కలిపి పెట్టేవాడు. ఆమె కాలకృత్యాలు తీసుకునేందుకు అనుమతించేవాడు కాదు. ఇక చేసేదేమి లేక ఆమె బకెట్‌లోనే తీర్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అలాగే రెండు వారాలకొకసారి ఆమె స్నానం చేయాల్సిన దుస్థితి. ఇలా సుమారు రెండు సంవత్సరాల వరకు ఆ బాలికను చిత్రహింసలు పెట్టాడు. అయితే ఇటీవల జూన్ 13న ఓ పనిమనిషి సహాయంతో ఆ బాలిక తప్పించుకుంది. అక్కడి నుంచి పారిపోయి తనకు పరిచయమైన ఓ మహిళకు తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పింది. దీంతో ఆ మహిళ ఆ బాలికను కృష్ణా జిల్లాలోని కంకిపాడులో ఉన్న హాస్టల్లో చేర్చాలని యత్నించింది. కానీ హాస్టల్ నిర్వాకులు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఆమెను చేర్చుకోవాలంటే పోలీస్ స్టేషన్ నుంచి పర్మిషన్ లెటర్ తీసుకురావాలన్నారు.

ఇక చివరికి ఆ మహిళ పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా పోలీసులు లెటర్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ బాలికను బాలల సంక్షేమ కమిటీకి తీసుకెళ్లింది. ఆమె అనుభవించిన నరకాన్ని అక్కడ ఉన్నవారికి వివరించింది. అనంతరం సీడబ్య్లూసీ సభ్యులు విజయవాడలోని దిశా పోలీస్ స్టేషన్‌కు ఆమెను పంపించారు. ఆ బాలిక చెప్పిన వివరాల ప్రకారం పూర్ణానంద స్వామీజీపై ఫోక్సో కేసు నమోదు చేశారు. ఆమెను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపిచారు. ఎట్టకేలకు ఆ స్వామీజీని విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆ బాలికను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రి తరలించారు. అయితే పూర్ణానంద స్వామిజీ దీనిపై స్పందించారు. కొంతమంది ఆశ్రమ భూములు కొట్టేయాలని చూస్తున్నారని.. ఈ నేపథ్యంలోనే కుట్ర జరిగిందని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?