అల్లూరి జిల్లా హుకుంపేట మండలంలోని ఉర్రాడ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కరెంటు స్తంభం మీద పడి విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటనలో మరొకరికి గాయాలయ్యాయి. పాఠశాల ఆవరణపై ఉన్న జీలుగు చెట్టు.. పక్కనే ఉన్న కరెంటు స్తంభంపై పడడంతో ఈ ఘటన జరిగింది. జీలుగు చెట్టు పడడంతో వైర్లతో సహా స్కూలు ఆవరణలోకి విద్యుత్ స్తంభం పడిపోయింది. స్కూలు విడిచి పెడుతున్న సమయం కావడంతో.. విద్యార్థులందరూ ఇంటికి వెళ్లేందుకు ఉత్సాహంగా పాఠశాల నుంచి బయటకు వెళ్తున్నారు.
ఆ సమయంలో ఈ ఘటన జరగడంతో అక్కడ ఉన్న విద్యార్థులకు విద్యుత్ తీగలు తగిలాయి.
ఈ ఘటనలో ఒకటో తరగతి చదువుతున్న ఐదేళ్ల ధన్విత మృతి చెందింది. అను అనే మరో విద్యార్థినికి గాయాలయ్యాయి. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు.. పవర్ సరఫరాను నిలిపివేశారు. సహాయకచర్యలు చేపట్టారు. అధికారులకు సమాచారం అందించారు. గాయపడిన విద్యార్థినికి చికిత్స అందించేందుకు ఆస్పత్రికి తరలించారు. ఊహించని ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని ఏపీ న్యూస్ కోసం ఇక్కడ..