మామూలు త్రాచు పాము, విశాఖలో కనిపించిన శ్వేత నాగును స్క్రీన్‌పై చూస్తున్నాం. రెండింటి మధ్య రంగులో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. విశాఖలో కనిపించిన ఈ అరుదైన పామునే శ్వేతనాగుగా చెబుతున్నారు. దాని బుస, పడగ, విషం అన్నీ మామూలు పాముకంటే భిన్నంగా ఉంటాయి. కరిస్తే క్షణాల్లోనే ప్రాణం పోవడం ఖాయం. ఎక్కడో, ఎప్పుడోగానీ కనిపించని ఈ అరుదైన సర్పం తాజాగా విశాఖ జాలరిపేటలో కనిపించింది. వలలో చిక్కి విలవిల్లాడుతున్న శ్వేతనాగును స్నేక్ క్యాచర్స్ చాకచక్యంగా కాపాడి సురక్షిత ప్రాంతంలో వదిలారు.
విశాఖపట్నం జాలరి పేట కోటవీధి ప్రాంతంలో అరుదైన శ్వేతనాగు కనిపించి కలకలం సృష్టించింది. కోట వీధి సమీపంలో మేరీ మాత ఆలయం కొండ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి చేరిన శ్వేతనాగు జనాల్లో కల్లోలం సృష్టించింది. పామును చూసిన స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ చాకచక్యంగా ఒడిసి పట్టుకున్నారు. చిన్నపాటి గాయాలు కావడంతో పాముకి ప్రథమ చికిత్స అందించారు. ఇది అరుదైన జాతిగా ఈ సర్పాన్ని గుర్తించినట్లు స్నేక్ క్యాచర్ కిరణ్ చెప్పారు.
అనంతరం ఈ అరుదైన శ్వేతనాగును జూలాజికల్ డిపార్ట్మెంట్ అధికారులు కు అప్పగిస్తామని తెలిపారు. లేదంటే, దూర ప్రాంతాలకు తీసుకెళ్లి అడవిలో విడిచి పెట్టడం జరుగుతుందని కిరణ్ తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..